"భారతరత్న" ప్రణబ్ ముఖర్జీ: పద్మ అవార్డుల జాబితా కూడా..

02:59 - January 26, 2019

ప్రతీ సంవత్సరం మాదిరే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి  కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు భూపేన్ హజారికా (మరణానంతరం)లకు కేంద్రం భారతరత్న ప్రకటించింది.భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారంగా పరిగణించే పద్మవిభూషణ్‌కు టీజెన్‌బాయ్‌, అనిల్‌కుమార్‌ మణీబాయ్‌, ఇస్మాయిల్‌ ఒమర్‌ గులే, బల్వంత మోరేశ్వర్‌ పురంధేరలు ఎంపికయ్యారు. 14 మందికి పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. 

సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిందా, మహాశయ దారమ్‌ పాల్‌, దర్శన్‌లాల్ జైన్‌, అశోక్‌ లక్ష్మణ్ రావు, కరియా ముండా, బుద్దాదిత్య ముఖర్జీ, నటుడు మోహన్‌లాల్‌, నంబినారాయణ్, కుల్దీప్‌ నయ్యర్‌, మిసెస్‌ బచేంద్రపాల్‌, వీకే షుంగ్లా, హుకుందేవ్‌ నారాయణ్‌, జాన్‌ చాంబర్స్‌ (అమెరికా), ప్రవీణ్‌ గోర్దాన్‌ (సౌతాఫ్రికా)కు పద్మభూషణ్‌ ప్రకటించారు. 
 
ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సునీల్‌ చత్రీ,  చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక , డాన్స్‌ మాస్టర్ ప్రభుదేవా, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, మనోజ్ బాజ్‌పాయ్, గౌతమ్ గంభీర్‌ లు  పద్మశ్రీ పురస్కారం పొందిన వారిలో ఉన్నారు.