2019 ఆస్కార్ లిస్ట్: చరిత్ర సృష్టించిన నెట్ ఫ్లిక్స్ , ఇండియన్ సినిమాకి ఈసారీ నిరాశే

11:31 - January 23, 2019

ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డుల కోసం నామినేషన్ల సందడి మొదలైంది.  2019 ఫిబ్రవరి 24న 91వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది.  ఆస్కార్‌ అవార్డుల పోటీ బరిలో దిగిన చిత్రాలను అకాడమీ అవార్డుల కమిటీ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా 'రోమా', 'ది ఫేవరెట్‌' చిత్రాలకు 10 విభాగాల్లో నామినేషన్లు దక్కాయి.  వాటికి ఉత్తమ చిత్రం సహా చెరో పది నామినేషన్లు దక్కాయి. తర్వాతి స్థానాల్లో ఎనిమిది నామినేషన్లతో ‘ఏ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’, ‘వైస్‌’,  ఏడు నామినేషన్లతో ‘బ్లాక్‌ పాంథర్‌’ నిలిచాయి. సూపర్‌ హీరో చిత్రం ‘బ్లాక్‌ పాంథర్‌’ చరిత్ర సృష్టించింది. ఆస్కార్‌ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్‌ అందుకున్న తొలి సూపర్‌ హీరో చిత్రంగా ప్రత్యేకత చాటుకుంది. ఉత్తమ నటుడి పురస్కారం కోసం విలియం డఫో, క్రిస్టియన్‌ బాలె, విగ్గొ మార్టెన్‌సెన్‌, బ్రాడ్లీ కూపర్‌, రమీ మలెక్‌ పోటీలో వున్నారు. ఉత్తమ నటిగా ఒలివియా కొల్‌మన్‌, యలిట్జా అపరిసియొ, మెలిస్కా మెక్‌ కెర్తీ, గ్లెన్‌ క్లోజ్‌, లేడీ గాగా పోటీలో నిలిచారు. 

ఈసారికూడా మన సినిమా మాత్రం లేదు. ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్‌ తరుపున బరిలో నిలిచిన విలేజ్‌ రాక్‌స్టార్‌ సినిమా ఫైనల్‌ లిస్ట్‌లో స్థానం సంపాదించలేకపోయింది.ఈపోటిలో పాల్గోనేందుకు భారత్ తరుపున 29 సినిమాలను చూసిన ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు ఫైనల్‌గా విలేజ్‌ రాక్‌స్టార్స్‌ను పోటికి ఎంపిక చేశారు. కానీ  చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటంతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. దీంతో భారత్‌ తరుపున ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు విలేజ్‌ రాక్‌స్టార్స్‌ను ఎంపిక చేశారు. కానీ సినిమా కూడా ఫైనల్‌ లిస్ట్‌ లో స్థానం సాదించలేకపోయింది. 

ఉత్తమ చిత్రం
* బ్లాక్‌ పాంథర్‌
* బ్లాక్‌క్లెన్స్‌మ్యాన్‌
* బొహిమియాన్‌ రాస్పోడి
* ది ఫేవరెట్‌
* గ్రీన్‌
* రోమా
* ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌
* వైస్‌
ఉత్తమ నటుడు
* క్రిస్టియన్‌ బాలీ (వైస్‌)
* బ్రాడ్లీ కూపర్‌ (ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)
* విలియమ్‌ డాఫోరు (ఎట్‌ ఎటిర్నీస్‌ గేట్‌)
* రామి మాలిక్‌ (బెహమానియా రాస్పోడీ)
* విజ్జో మార్టిన్‌సేన్‌ (గ్రీన్‌బుక్‌)
ఉత్తమ నటి
* ఎల్టిజా అప్రాసియో (రోమా)
* గ్లనెన్‌ క్లోజ్‌ (ది వైఫ్‌)
* ఓల్వియా కోల్‌మెన్‌ (ది ఫేవరెట్‌)
* లేడీ గాగా (ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)
* మెల్సియా మెక్‌కార్తీ (కెన్‌ యు ఎవర్‌ ఫర్‌గివ్‌ మి)
ఉత్తమ దర్శకుడు
* బ్లాక్‌క్లెన్స్‌మ్యాన్‌ (స్పైక్‌లీ)
* కోల్డ్‌వార్‌ (పావెల్‌ పావెలిస్కోవీ)
* ది ఫేవరెట్‌ (ఎర్గోస్‌ లాథిమోస్‌)
* రోమా (అల్ఫోన్సో క్యురాన్‌)
* వైస్‌ (ఆడమ్‌ మెకే)