ఒలా(Ola) పై నిషేదం, ఆగిపోనున్న క్యాబ్ సర్వీసులు: ఆరునెలలపాటు రోడ్డుఎక్కొద్దు

11:38 - March 23, 2019

కర్నాటక రాష్ట్రవ్యాప్తంగా ఆరునెలల పాటు ఓలా క్యాబ్‌ సర్వీసులపై నిషేధం విధిస్తూ రాష్ట్ర రవాణాశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.క్యాబ్స్‌కు విధించిన గైడ్‌లైన్స్‌ను పాటించనందుకు కర్ణాటక రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 
           ఓలా సంస్థ ఇటీవల క్యాబ్‌ సర్వీసులకు తోడుగా బైక్ సర్వీసులను కూడా కర్ణాటకలో ప్రారంభించింది. అయితే దీనికోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రవాణా శాఖ దర్యాప్తు చేపట్టింది. నిజమని తేలడంతో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఓలా సంస్థను ఆదేశించింది. అయితే సంస్థ యాజమాన్యం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం ఓలా లైసెన్స్‌ను రద్దు చేసింది. లైసెన్స్ ఒరిజినల్ పత్రాలను మూడు రోజల్లోగా రవాణా శాఖకు అప్పగించాలని ఆదేశించింది. 

ఓలా సేవలు 2010లో ముంబైలో ప్రారంభమయ్యాయి. తర్వాత ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరుకు తరలించారు. కర్ణాటకలో పదివేలకుపైగా క్యాబ్‌లతో మైసూరు, మంగళూరు, హుబ్లీ, బెంగళూరుల్లో  10వేల క్యాబ్‌లతో సర్వీసులు నడుపుతోంది.