బిగ్ బెన్ టు టవరాఫ్ లండన్: ఇంగ్లాండ్ లోనూ మొదలైన ఆటోల సందడి

11:52 - April 2, 2019

*ఇంగ్లాండ్ లోనూ ఇక ఆటోల హల్చల్ 
*బ్రిటీష్ రోడ్లమీదకి ఆటోలని ప్రవేశపెట్టిన "ఒలా"
*ఆటో ఇప్పుడు అక్కడ ఒక కొత్త క్రేజ్  

 

నిన్నా మొన్నటి వరకూ ఆటో అనే త్రిచక్ర వాహనం పాకిస్థాన్, ఇండియా లాంటి తూరుపు దేశాలకే పరిమితం. ఇక పైన టాప్ ఉండే చిన్న ఆటోలైతే మన దేశపు స్పెషల్ అనుకోవాలి, ఈ చిన్న వాహనం పబ్ల్కిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు, మీటర్, షేర్, ఆటోలతో నగర జీవి ఎంత అనుబందాన్ని కలిగిఉన్నాడో మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముందీ? అయితే ఇప్పుడు మనతరహా ఆటోలు ఇంగ్లాండ్ లోనూ తిరిగేస్తున్నాయి. ఇంగ్లాండ్ వీదుల్లో ఆటోల సంచారం ఇప్పుడొక కొత్త క్రేజ్. నమ్మలేక పోతున్నారు కదా కానీ ఇది నిజం  

                                               

ప్రముఖ ట్రావెల్ యాప్.. ‘ఓలా’ మన ఆటోను ఇంగ్లాండ్‌లో సర్వీసుల్ని అందిస్తోంది. ఇలా ఓలా ఆటోలను ఇంగ్లండ్ వాసులకు కూడా అందుబాటులోకి తీసుకెళ్లింది. ‘ఉబెర్’కు పోటీ ఇచ్చేందుకు తొలిసారిగా ఇంగ్లండ్ లో  ఆటో సేవలను ప్రారంభించింది ఒలా. ఇండియాకు చెందిన ‘బజాజ్ ఆటో’, ఇటలీకి చెందిన ‘పియాజ్జియో’ల ఆటోలనే ఇంగ్లండ్ లో కూడా నడుపుతోంది.

                                                

ముందుగా లివర్‌పూల్‌లో ప్రారంభించిన ఈ ఆటోలు పచ్చ రంగులో మెరుస్తున్న ఆటోలని  లివర్‌పూల్ ప్రజలు తెగ మురిసిపోతున్నారట.  బ్యాటరీతో నడిచే ఈ ఆటోలతో కాలుష్యం బాధ కూడా ఉండదు.  కస్టమర్లను ఆకట్టుకోడానికి కొద్ది రోజులపాటు ఇంగ్లండ్ వాసులకు ఓలా ఆటోలు ఫ్రీ సర్వీస్ ను కూడా అందిస్తాయంటోంది ఓలా సంస్థ. అంతేకాదు ఏప్రిల్ లోగా ఓలా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేవారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఓలా ప్రకటించింది.