కన్నతల్లి శవాన్ని సైకిల్ పై: మరోసారి "కులం" పంజా

11:53 - January 17, 2019

కొన్నేళ్ళకి ముందు జరిగిన సంఘటన, ఎవ్వరూ మర్చిపోలెనంతగా మన మనసుల్లో ముద్రించుకు పోయిన సంఘటన తన భార్య మరణిస్తే, మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక, ఓ చాపలో ఆమెను చుట్టి, భుజానికి ఎత్తుకుని నడుస్తూ వెళ్లిన మాంఝీ మరోసారి గుర్తుకు వచ్చేలా మళ్ళీ అదే రాష్ట్రం లో అదే తరహా ఘటన జరిగింది. మరణించిన తల్లి దేహాన్ని ఖ్ననం చేయటానికి కూడా ఎవరూ సాయం రాక. ఆ మృతదేహాన్ని సైకి వెనుక కట్టుకొని స్మశానానికికి తీసుకు వెళ్ళిన 17 ఏళ్ళ పిల్లవాడి ఫొటో మరొక్కసారి ఈ దేశపు ముఖచిత్రాన్ని మనకు చూపించింది. 

    ఓడిశా రాష్ట్రంలోని ఝార్సీగూడ జిల్లా కర్పబహాల్ గ్రామానికి చెందిన జానకి వితంతువు. జానకి భర్త మరణించడంతో తన 17 ఏళ్ల కుమారుడితో కలిసి పుట్టింట్లోనే నివాసం ఉండేది. జానకి నీళ్ల కోసం బావి వద్దకు వస్తే ప్రమాదవశాత్తూ ఆ బావి కూలటంతో మరణించింది. కులం తక్కువ అన్న కారణాన జానకి శవానికి అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్థులెవరూ ముందుకు రాలేదు. కులాంతర వివాహం చేసుకుందన్న కారణాన సొంత కులం మనుషులు కూడా దగ్గరికి రాలేదు.  తల్లి అంత్యక్రియలు చేసేందుకు చేతిలో డబ్బు లేక జానకి 17 ఏళ్ల కుమారుడు అంత్యక్రియలు జరిపించాడు. తల్లి శవాన్ని మోసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బాలుడే సైకిలుపై తల్లి శవాన్ని తీసుకొని అడవికి వెళ్లి అక్కడే గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. ఈ ఆ గ్రామస్తులని తప్ప చూసిన వారందరినీ ఘటన పలువురిని కంట తడిపెట్టించింది.