పదిహేను నిమిషా...లే!

01:03 - August 18, 2018

         యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో ’అరవింద సమేత’ మూవీ వస్తోంది. ఇప్పటికే టీజర్ ఓ ఊపు ఊపేసింది. కొత్త కాంబినేషన్. కొత్త కోణంలో త్రివిక్రమ్ ఎలా ఉండబోతోందో అని భారీ అంచనాల్ని మరింత పెంచేసింది టీజర్. 

ఐతే అంతకు మందు కొరటాల శివ డైరక్షన్ లో జనతా గ్యారేజ్ లో సాఫ్ట్ గా చెప్పి.. వినకపోతే హార్డ్ వేర్ పరితనం చూపించాడు తారక్.. తరువాత కిందటి ఏడాది బాబి దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ లోమూడు పాత్రలలో మూడు వేరియేషన్స్ చూపించి అభిమానుల మతిపోగొట్టాడు. దాంతో త్వరలో రాబోయే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
           త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మొదటి సారి త్రివిక్రమ్ యాక్షన్ సెగ్మెంట్ ను ఎంచుకున్నాడు. తారక్ కు మాస్ పాత్రలు కొట్టిన పిండి. మాటల మాంత్రికుడికి రేర్ ప్రయత్నమే అని చెప్పాలి. సిక్స్ ప్యాక్ తో విలన్లను తరిమే సీన్ టీజర్ లో అదరగొట్టింది. మొత్తంగా ఈ సినిమాలో 15 నిమిషాల పాటూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడట. తమన్ సంగీతం అందిస్తున్నారు.  పూజాహెగ్డే, జగపతి, నాగబాబు ఈ మూవీలో నటిస్తున్నారు.