బిగ్ బాస్ 3 : మళ్ళీ రానున్న ఎన్టీఆర్ ?? 

14:09 - January 26, 2019

భారతీయ బుల్లితెరమీద క్రేజీ షోగా మారింది బిగ్ బాస్ హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి అక్కడి నుంచీ దక్షిణాదికీ దిగుమతి అయిన ఈ కార్పోరేట్ గేమ్  షో ఇక్కడ కూడా సక్సెస్ అనే పేరు తెచ్చుకుంది. కొద్ది రోజుల క్రితం పార్టిసిపెంట్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే వారిలో ఎవరుంటారు? ఎవరుండరు? అనే విషయాల్లో స్పష్టత అయితే లేదు. ఇకపోతే ఇప్పుడు నడుస్తున్న పెద్ద చర్చ ఏంటంటే.. ‘బిగ్‌బాస్-3’కి హోస్ట్ ఎవరు? చిరంజీవి అని కొందరు.. వెంకటేష్ అని మరికొందరు గెస్ కొట్టారు. కానీ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తే రెండో సీజన్ కి మాత్రం హీరో నాని వచ్చాడు. 
 
ఎన్టీఆర్ సారథ్యంలో బిగ్‌బాస్ సీజన్-1 ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ షో రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. దీంతో ప్రస్తుతం సీజన్ -3కి హోస్ట్‌గా ఎన్టీఆర్‌ను తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ మేరకు ఆయనను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా సఫలమయ్యయట. ఎన్టీఆర్ సీజన్-3 చేసేందుకు ఒప్పుకున్నాడట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌లో యంగ్ టైగర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ షూటింగ్‌కి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారని సమాచారం.
తన బిజీ షెడ్యూల్ వల్ల యంగ్ టైగర్ రెండో సీజన్ నుండి తప్పుకోవటంతో ఆ అవకాశం నాచురల్ స్టార్ నానికి దక్కింది. అయితే నానీ ఎంత ప్రయత్నం చేసినా ఎన్టీఆర్ లా షో మీద కమాండ్ చూపించలేకపోయారు. అందర్నీ ఏదో ఒక విషయంలో కోప్పడిన నానీ కౌశల్ విషయంలో జోక్యం చేసుకోలేదు. కౌశల్ వ్యవహారం చాలా సీరియస్ గా నడుస్తున్నా నానీ మాత్రం కౌశల్ ను ఏమంటే తనకు ఏమి ఇబ్బంది కలుగుతుందో అన్న భయంతోనే షో హోస్ట్ చేశారు. మొదట్లోనే కౌశల్ ను వెనకేసుకొచ్చి కిరీటిపై తప్పుగా ప్రొజెక్ట్ చేసిన నానీ చేసిన ఆ తప్పే బిగ్ బాస్ షో కు పెద్ద తలనొప్పిగా మారి సీజన్ 2 కాంట్రవర్సీకి కారణం అయ్యింది. అందుకే ఈ గొడవలేవీ లేకుండా మళ్ళీ  ఎన్టీఆర్ నే మూడో సీజన్ కి హోస్ట్ గా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారట.