ఎన్టీఆర్ సినిమాని ఫ్రీగా ఇస్తున్నారా?: "మహానాయకుడు" మీద అనుమానంతోనే!?

06:40 - January 16, 2019

ఈ సంవత్సరం టాలీవుడ్ తీవ్ర నిరాశగా మొదలైంది. భారీ హిట్ అనుకున్న రెండు సినిమాలూ దారుణమైన స్థితిలోఅకి వెళ్ళిపోయాయి. బోయపాటి, రామ్ చరణ్ కాంబో "వినయ విధేయ రామా" అట్టర్ ఫ్లాప్ అనిపించుకుంటే. ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ లో భాగంగా వచ్చిన "కథానాయకుడు" అంతంత మాత్రంగా నెట్టుకొచ్చింది. నిజానికి ‘కథానాయకుడు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో దాదాపు 1000 స్క్రీన్లలో విడుదల చేసారు. అద్దిరిపోయే హిట్ అవుతుందనీ, కోట్ల కొద్దీకలెక్షన్లతో ఈ సంవత్సరాన్ని ఊపేస్తుందనీ ఆశించారు. 

అయితే అందరూ మరిచిన విషయం ఒకటుంది. ఎంత గొప్ప విశ్వవిఖ్యాత నట సార్వభుముడైనా జీవితం జయాపజయాల సమాహరమే. అది ఎవరూ కాదన లేని సత్యం. అలాంటిది ఆయన జీవితం విజయాలబాటని ఆయనొక దైవస్వరూపమ ని ప్రచారం చేయటానికి ఈ సినిమా ద్వారా విశ్వప్రయత్నం చేశారు. అయితే ఆయన జీవితం తెరచిన పుస్తకం. తల్లిదండ్రుల ద్వారా ఈ తరం పిల్లలందరికి ఆయన గురించి తెలుసు. సమాజ పరంగా ఆయన ఒక రాజకీయపక్షానికి చెందటంతో, నటుడుగా ఆయన్ని ఆరాధ్య నటుడుగా గౌరవించినా, ఆయన ఒక మామూలు మనిషే అన్న విషయం అందరికీ తెలుసు. ఆయన జీవితం లో అడుగు అడుగూ జనానికి తెలిసిందే. ఇక కొత్తగా చెప్పటానికి కథ ఏమీ లేదు. కొత్తగా చెప్పటానికీ అవకాశమూ లేదు. అక్కడే పెద్ద దెబ్బ పడింది సినిమాకి. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్స్ ఖాతాలో చేరుతుందని భావించారు.  

  కానీ  ఈసినిమాకు  ప్రపంచవ్యాప్తంగా కేవలం ఇప్పటి వరకు 35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక నెట్ కలక్షన్స్ విషయానికి వస్తే ఆ ఫిగర్ 16 కోట్లకు దాటదు అని అంటున్నారు. దీనితో 70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈమూవీ ప్రస్తుతం భారీ నష్టాల వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక రాబోయే రెండో భాగం "మహా నాయకుడు" సంగతేమిటన్న అనుమానం రావటం మామూలే కదా. ఈ స‌మ‌యంలో ఎన్టీఆర్ యూనిట్, నిర్మాత బాల‌య్య ఒక  సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. ఖచ్చితంగా నిజానిజాలు తెలియదు గానీ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ప్రకారం ‘ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు’ సినిమాను బ‌య్య‌ర్ల‌కు ఫ్రీ గా ఇచ్చేస్తున్నార‌ట.  అయితే విడుద‌లైన త‌ర్వాత లాభాల్లో వాటా  తీసుకోవాల‌నేది నిర్మాత‌ల‌కు, బ‌య్య‌ర్ల‌కు మ‌ధ్య ఒప్పందం అనుకుంటున్నారు. దీనికి క్రిష్ కూడా ఒప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. చూదాలి మరి మహానాయకుడు అయినా ఈ కథానాయకుడి నష్టాలని పూడుస్తాడో లేదో మరి.