ఒవర్సీస్ రిపొర్ట్ "అద్బుతం" : "కథానాయకుడు" బ్లాక్ బస్టర్ అవ్వబోతున్నట్టేనా

06:55 - January 9, 2019

ఇంకా కొన్ని గంటల్లో   ఎన్టీఆర్ బయోపిక్ "కథా నాయకుడు" విడుదల కానుంది.  ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే బెనిఫిట్ షోల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయని తెలంగాణా ప్రభుత్వం సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ షోల ప్రదర్శనకి అనుమతి ఇవ్వడం మానేసింది.కానీ పండగ సమయం కావడం, ఈ చిత్రానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అదనపు షోలు ప్రదర్శించడానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించింది.
ఇప్పటికే ఈ సినిమా పై సెన్సార్ స్పందన పాజిటివ్ గా వచ్చింది. బాలకృష్ణ, విధ్యాబాలన్ ల నటన అద్బుతం అనీ, నిర్మాణ విలువలతో ఈ సినిమా ఖచ్చితంగా సంచలనం అవుతుందనీ చెప్పటంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలకు బదులు రోజులు ఆరు ఆటలు వేసుకునే విధంగా అదనపు షోలకు అనుమతులు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోల హంగామా తగ్గినప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం ఆ జోరు ఏమాత్రం తగ్గలేదు.తాజాగా ఎన్టీఆర్ 'కథానాయకుడు' బెనిఫిట్ షో టికెట్స్ ఓవర్సీస్ లో భారీ రేటుకి అమ్ముడిపోయాయి. ఓ ఎన్నారై ఈ సినిమా మొదటి టికెట్ ని ఏకంగా మూడున్నర లక్షలు పెట్టి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మొత్తాన్ని  డిస్ట్రిబ్యూటర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి డొనేట్ చేశాడు.
అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఆధారంగా సినిమాపై వున్న బజ్‌ని అంచనా వేయడానికి లేదు. తొలి రోజు థియేటర్ల వద్ద బాలయ్య సినిమాకి గ్యారెంటీ ఆడియన్స్‌ వుంటారు. కాకపోతే బాహుబలి, మహానటి రీతిన బుకింగ్స్‌ ఓపెన్‌ కాగానే వుంటుందనుకున్న సందడి లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. సినిమా బాగుందనే టాక్‌ వస్తే మాత్రం బయోపిక్‌ బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు చేయడం ఖాయం. అయితే వాస్తవానికి ఎంత దగ్గరగా చూపించారనేదానిపై ఇది ఆధారపడి వుంటుంది. ఏమాత్రం అతిశయాలకి పోయారనిపించినా కానీ అది రిజల్ట్‌పై రిఫ్లెక్ట్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ బాక్సాఫీస్‌ భవితవ్యం తేలడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే ఓవర్సీస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావ్టం చూస్తే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దుమ్మురేపుతుందనే అనుకోవచ్చు.  

సౌత్ రాష్ట్రాల్లో కేరళలో మినహా అన్ని చోట్లా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నార్త్‌లో ముంబైతో పాటు కొన్ని ప్రధాన నగరాల్లో విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్‌లో యూఎస్ఏలో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అవుతుండగా గల్ప్ కంట్రీస్, ఆస్ట్రేలియా, కెనడా, యూకె సైతం వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రం తెలుగులో మాత్రమే విడుదలవుతోంది. తర్వాత ఇతర భారతీయ భాషల్లో అనువదించి చేసి విడుదల చేయబోతున్నారు.