ఎన్టీఆర్‌ చేతులెత్తేశాడట!

17:25 - March 18, 2019

కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సాధించింది.  ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు మూడో సీజన్ ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సాధించింది.  ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు మూడో సీజన్ ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సీజన్‌కి హోస్ట్‌గా ఎవరుంటారన్నదే ఇప్పుడు నిర్వాహకులముందున్న ప్రశ్న. 

బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. కానీ 'అరవింద సమేత' షూటింగ్ కారణంగా రెండో సీజన్ కు హోస్ట్ గా చేయలేదు. ఎన్టీఆర్ స్థానంలో నాని హోస్ట్ గా వచ్చాడు.  నాని మూడో సీజన్ కు 'నో' చెప్పడంతో బిగ్ బాస్ నిర్వాహకులు మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. అయితే ఎన్టీఆర్‌ ఈసారి కూడా హోస్ట్‌గా చేసేందుకు రెడీగా లేనంటూ చేతులెత్తేశాడట!. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను వచ్చే ఏడాది జనవరిలోపే పూర్తి చేయాలని 'RRR' టీమ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఏప్రిల్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేయడం జరిగిందట.  దీంతో ఎన్టీఆర్ కు బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించే సమయం ఉండదనే ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వాహకులకు తన నిర్ణయాన్ని తెలిపాడట. ఇక ఇప్పుడు బిగ్‌బాస్‌ నిర్వాహకులు సీజన్‌ 3కి మరొక హోస్ట్‌ని వెతుక్కోవాల్సిందేనట!