మెగా హీరోయిన్‌కి ఫోటో తిప్పలు

13:47 - March 22, 2019

తమిళనాడు మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ పరిరక్షణ కోసం ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకంతో పాటు మొబైల్ ఫోన్స్ వాడకంపై పూర్తిగా నిషేదం విధించడం జరిగింది. అయితే తాజాగా హీరోయిన్ నివేదా పేతురాజ్ మాత్రం గుడిలో స్వేచ్చగా మొబైల్ వాడింది అదే కాకుండా ఆమె గుడి లోపల స్నేహితురాలితో ఫొటోలు కూడా తీసుకుంది. ప్రస్తుతం ఈమె మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో 'చిత్రలహరి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఆలయంలో మొబైల్‌ ఫోన్స్‌ వాడకూడదని గత ఏడాది మద్రాస్ హైకోర్టు ఈ విషయాన్ని క్లీయర్ గా పేర్కొనడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మరియు గుడి నిర్వాహకులు కూడా మొబైల్ ఫోన్స్ వాడకంను పూర్తిగా నిషేదించారు. డ్యూటీలో ఉన్న అధికారులు కూడా అక్కడ మొబైల్స్ వాడటం బ్యాన్ చేశారు. అయితే నివేద పేతురాజ్‌కు ఆ విషియం దృష్టిలో వుందో లేదో కానీ...మోబైల్‌ ఆలయంలోకి తీసుకుపోడంతో పాటు, తన స్నేహితురాలితో కలిసి ఫోటోస్‌ దిగడం జరిగింది. ఇదిలావుంటే.. ఆ ఫోటోస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతోషంగా మీనాక్షి అమ్మవారి ఆలయంను దర్శించుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలోని ఆమె పోస్ట్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. మీనాక్షి అమ్మవారి ఆలయంలో మొబైల్స్ బ్యాన్ అనే విషయం మీకు తెలియదా సెలబ్రెటీ హోదాలో మీరు మొబైల్స్ ను గుడి లోపల వాడారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రెటీ అయినంత మాత్రాన మీరు దేవుడి వద్ద సామాన్య వ్యక్తులే అనే విషయాన్ని మీరు ఎలా మర్చి పోతారు. సామాన్యులకు ఒక న్యాయం సెలబ్రెటీలకు ఒక న్యాయంను గుడి అధికారులు ఎలా అమలు చేస్తారు అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ' చిత్రలహరి ' చిత్రంతో పాటు  ' బ్రోచేవారెవరురా '  అనే సినిమాలో కూడా  నివేదా నటిస్తోంది. మెల్ల మెల్లగా టాలీవుడ్ కోలీవుడ్ లో అడుగులు వేస్తున్న ఈ అమ్మడికి ఈ ఫొటోల వ్యవహారం పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టేలా ఉంది.