హీరోల్ని మార్చిన ’కథలు’..

00:06 - August 18, 2018

        ఒకరికోసం తయారు చేసిన కథలలో మరో హీరోలు నటించడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది.. కొన్ని సార్లు మిస్సయ్యామే అనిపించేలా హిట్ అయితే.. మరోసారి ఈ సినిమా చేయకపోవడమే మంచిదయ్యిందని సంతోషపడతారు.. అలా ఓ రెండు సినిమాలను మిస్సయిన హీరోలు ఎవరో తెలుసుకోవలంటే మొత్తం స్టోరీ చదవండి..

          దిల్ రాజు బ్యానర్ నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన శతమానం భవతి బాక్స్ ఆఫీసును షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీని  దిల్ రాజు సాయి ధరమ్ తేజ్ తో ప్లాన్ చేశాడంట.  శతమానం భవతి రిలీజ్ టైం లోనే చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైధీ నం 150 రిలజ్ అవుతుండటంతో, మామకు పోటీగా నివడం ఇష్టం లేక తేజ్ వదిలేసుకున్నాడు. ఆ మూవీ శర్వానంద్ చేయడం అది సూపర్ హిట్ అవ్వడం జరిగిపోయింది..
          ఈ మధ్యే రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకున్న శ్రీనివాస కళ్యాణం మూవీ కూడా దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిందే.. అయితే ఈ మూవీకి కూడా ఇలాంటి కథే ఉంది. ఈ సినిమాకు అనుకున్న హీరో నితిన్ కాదట. దిల్ రాజు ఈ కథ కోసం రాంచరణ్ కాని ఎన్టీఆర్ ను కాని అనుకున్నారట.  ఎన్టీఆర్ కి కథ కూడా చెప్పాడట. మరి ఏం జరిగిందో తెలియదు కాని ఈ మూవీ కథ నితిన్ దగ్గరికి వచ్చి చేరింది. విన్న వెంటనే నితిన్ ఎంతో ఉత్సాహంగా ఒప్పుకున్నాడట. కానీ శ్రీనివాస కళ్యాణం యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది.