ఆ సినిమా తరువాత పాత్రల ఎంపికలో జాగ్రత్తపడ్డాను: నయనతార

12:55 - May 9, 2019

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. స్టార్ హీరోయిన్ అయినా అన్ని సినిమాలు హిట్స్ కావు.. అన్నీ ఫ్లాప్స్ కావు. అలానే వారి ఎంపిక ప్రతిసారి కరెక్ట్ అవుతుందనే గ్యారెంటీ కూడా లేదు. ఒక్కోసారి తమ కథల ఎంపిక పట్ల సినిమా రిలీజ్ అయిన తర్వాత చింతిస్తుంటారు. అయితే నయనతారకు గతంలో తీసిన ఒక సినిమా ద్యారా ఇలాంటి పరిస్థితి ఎదురైందట!. సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్న నయనతారా రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్లో 'గజిని' చేయడం తన కెరీర్ లో ఒక చెత్త నిర్ణయం అని చెప్పింది.  ఆ సినిమాలో తను పోషించిన చిత్ర పాత్ర గురించి మాట్లాడుతూ "నాకు నెరేషన్ ఇచ్చిన చిత్ర పాత్రకు స్క్రీన్ పై కనిపించిన పాత్రకు చాలా డిఫరెన్స్ ఉంది" అంటూ ఆరోపించింది. అందుకే... 'గజినీ'  ఎక్స్ పీరియన్స్ తర్వాత తన పాత్రల ఎంపిక పట్ల జాగ్రత్త పడ్డానని తెలిపింది. 'గజినీ' లో అసిన్ మెయిన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.  నయన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. 'చంద్రముఖి' లో చేసింది కూడా చిన్న పాత్ర అయినప్పటికీ తనకు మంచి పేరు తీసుకొచ్చిందని.. మొదట్లో ఆ పాత్ర స్వీకరించేందుకు తటపటాయించానని తెలిపింది. అదే సమయంలో విజయ్ సినిమా 'శివకాశి' లో కూడా ఒక సాంగ్ మాత్రమే చేసినప్పటికీ అది కూడా తనకుమంచి గుర్తింపు తీసుకొచ్చిందని తెలిపింది.