100కోట్ల నష్ట పరిహారం: తప్పుడు వార్తల మీద నవాజుద్దీన్ తమ్ముడి వివాదం

12:39 - April 13, 2019

*పత్రిక మీద పరువు నష్టం దావా వేసిన స్టార్ బ్రదర్ 

*హీరోయిన్లు పారిపోతున్నారంటూ వార్తలు రాసినందుకే

*బాలీవుడ్ హాట్ టాపిక్ నవాజుద్దీన్ సిద్దిఖీ తమ్ముడు షమాసుద్దీన్ వివాదం 

 

 

మీటూ ఉధ్యమం అటు హాలీవుడ్ లోనూ ఇటు బాలీవుడ్ లోనూ సమానంగా ప్రకంపణలు రేపింది. నిన్నా మొన్నటి వరకూ ఎంతో గౌరవ ప్రదంగా కనీచిన ప్రముఖుల చీకటి ప్రవర్తన బట్టబయలయ్యింది. ఎందరో సినీ ప్రముఖులు ఈ మీటూ వల్ల తమ పాత చరిత్రలు బయటపడి అభాసు పాలయ్యారు. అయితే మీడియా అత్యుత్సాహం వల్ల కూడా కొందరి కెరీర్ దెబ్బ తిందనే మాటలూ వినిపించాయి.  తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ సోదరుడు షమాసుద్దీన్ సిద్దిఖీ  అసలు ఏతప్పూ చేయని తనమీద వార్తలు రాసి నిరూపించలేని ఆరోపణలు చేసి తన పరువు తీశారు అంటూ పరువు నష్టం దావా వేశాడు.  
 
 మీటూ నడుస్తున్న సమయంలోనే నా ప్రవర్థన వల్ల నాతో నటించటానికి వచ్చే హీరోయిన్లు ప్రాజెక్ట్ కూడా వదులుకుని పోయారంటూ ఓ పత్రిక వార్తను ప్రచురించటంతో  నా పరువు పోయింది. నేను హీరోయిన్స్ తో ఎంతో గౌరవంగా ఉంటాను నాతో పని చేసేందుకు హీరోయిన్స్ చాలా ఇష్టపడతారు ఏ ఒక్కరు కూడా నా నుండి దూరంగా వెళ్లి పోలేదు" అంటూ కోర్టుకు తెలియజేశాడు. కాని సదరు పత్రిక నాపై తప్పుడు కథనంను రాసిందని, ఇప్పుడు నా గురించి ఇండస్ట్రీలో అంతా బ్యాడ్ గా అనుకుంటున్నారని అందుకే నా పరువుకు భంగం కలిగేలా చేయడంతో పాటు నన్నుమానసిక వేదనకు గురి చేసినందుకు గాను సదరు పత్రిక నాకు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అని డిమాండ్ చేసాడు షమాసుద్దీన్. 

అయితే అతను అడుగుతున్న మొత్తం ఎంతో తెలుసా ఒకటేఎ రెండు కాదు ఏకంగా 100 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలంటూ కొండమీదెక్కి కూచున్నాట్ట. నిజానికి మీటూ సమయంలోనే కాదు అంతకు ముందు కూడా షమాసుద్దీన్ పై మీడియాలో పలు వివాదాస్పద వార్తలు వచ్చాయి. అయితే అవేవీ ఆధారాలు లేని వార్తలని, తాను ఏ హీరోయిన్ తోనూ అమర్యాదగా ప్రవర్తించలేదని చెప్తున్నాడు షమాసుద్దీన్. అయితే తన తమ్ముడు మీద ఇంత వివాదం జరుగుతున్నా నవాజ్ మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉన్నాడు మరి.