ఎన్నికల వేళ మోడీకి షాక్‌...

13:17 - March 20, 2019

కీలకమైన ఎన్నికల వేళ.. మోడీ పరివారం మొత్తం ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తూ.. అలాంటి నేత మరోసారి ప్రధాని కావాల్సిందేనంటూ ఇంటా బయటా భారీగా ప్రచారంచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో ఒక బుక్‌ రిలీజ్‌ వల్ల మోడీకి పెద్ద షాక్‌ తగిలినట్టయింది. అదెలా అనుకుంటున్నారా..ఆ మద్యకాలంలో పెద్దనోట్ల రద్దుతో అన్ని సమస్యలకూ చెక్‌ పెట్టొచ్చూ..అంటూ యావత్‌ ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేసిన మోడీగారి పని గుర్తుండే వుంటుంది. అయితే అది ఎంత పెద్ద తప్పో అంటూ ఒక బుక్‌ రిలీజ్‌ అయింది. అదే ‘ది గ్రేట్ డిసప్పాయంట్మెంట్: హౌ నరేంద్ర మోదీ స్వాండర్డ్ ఏ యూనిక్ ఆపర్చూనిటీ టూ ట్రాన్స్ఫార్మ్ ది ఇండియన్ ఎకానమీ’ . ప్రముఖ ఆర్థికవేత్త.. రాజకీయ విశ్లేషకుడు సల్మాన్ అనీజ్ సోజ్ అనే పెద్ద మనిషి ఈ పుస్తకాన్ని రాశారు. దీనిలో మోడీ హయాంలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపించారు. ఇందులో పెద్దనోట్ల రద్దు విషయాన్ని ప్రస్తావించటమే కాదు.. అదో భయంకరమైన ఆలోచనగా పేర్కొన్నారు. అంతేకాదు.. మోడీ హయాంలో ఆయన అమలు చేసిన ఆర్థిక విధానాల్ని మోడీనామిక్స్ గా పేర్కొంటూ చేసిన విశ్లేషణ ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి.. దీని మీద మోడీ అభిమాన సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. ఎందుకంటే...వారు ఎప్పుడూ మోడీ పాజిటివ్స్ మాత్రమే చెబుతారు కానీ నెగిటివ్స్ చెప్పటం కనిపించదు. మోడీ పాలనను మెరుపుల్ని చెబుతారే కానీ.. మరకల్ని అస్సలు ప్రస్తావించారు.