ఫ్యామిలీలో ఎవ్వరికీ హిట్‌ రావడం లేదు: తీవ్ర విశ్లేషనలో నాగార్జున

14:08 - February 7, 2019

నాగార్జున రెండో నట వారసుడు అఖిల్ టాలీవుడ్ ప్రస్థానం పట్ల ఒక స్టార్ హీరోగా  అసంతృప్తి ఉండటం సహజం. ఎంత జాగ్రత్త వహించినా ఎంత టైం తీసుకుని హిట్ ట్రాక్ ఉన్న దర్శకులను తీసుకున్నా వాళ్ళకో ప్లాప్ వచ్చి పడుతోందే తప్ప అఖిల్ కోరుకున్న సక్సెస్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఒకపక్క చైతు గత రెండేళ్లుగా హిట్ కొట్టలేకపోయాడు. అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను కూడా బాంబ్ అయ్యింది. మరోపక్క నాగార్జున పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. నాని లాంటి ట్రెండింగ్ హీరోతో దేవదాస్ చేస్తే అది హిట్ అని కూడా అనిపించుకోలేకపోయింది. మరోపక్క మేనల్లుడు సుమంత్ కం బ్యాక్ సజావుగా లేదు. సుబ్రమణ్యపురం-ఇదం జగత్ లో హీరోగా చేసినా ఎన్టీఆర్ కథానాయకుడులో స్పెషల్ రోల్ వేసినా అన్ని డిజాస్టర్లే. ఇక సుశాంత్ అనే హీరో ఉన్నాడనే సంగతే ప్రేక్షకులు మర్చిపోయారు. ఈ నేపధ్యంలో జరుగుతున్న పరిణామాల పట్ల నాగ్ ఒకింత సీరియస్ గానే ఉన్నాడని సన్నిహితుల మాట .ఫ్యామిలీలో ఏ హీరోకీ సరైన హిట్ ఎందుకు రావడం లేదో తీవ్రంగా విశ్లేషించే పనిలో పడ్డట్టు తెలిసింది. చైతు మజిలీ-వెంకీ మామలతో బిజీగా ఉన్నప్పటికీ అవి హిట్ అయితేనే కాస్త మార్కెట్ లో పుంజుకోవచ్చు.  ఈ పరంపర ఇలాగె కొనసాగితే అక్కినేని బ్రాండ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తాను ఓకే చెప్పిన మన్మధుడు సీక్వెల్ తో పాటు అఖిల్ చైతుల ఫ్యూచర్ ప్లాన్ గురించి నాగ్ చాలా తీవ్రంగా మేధో మధనం చేస్తున్నట్టు టాక్. తండ్రిగా బిడ్డలు సెటిలయ్యేదాక ఈ తిప్పలు తప్పవుగా.