మరోసారి పవన్‌ని ఎటాక్‌ చేసిన శ్రీరెడ్డి

17:27 - January 8, 2019

నాగబాబు కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు బాలకృష్ణ చేసిన ప్రతి కామెంట్‌కు వీడియోల రూపంలో విడుదల చేసి కౌంటర్‌ ఇచ్చాడు. ఇంకా వున్నయి అంటూ సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదిలా వుంటే..ఇప్పుడు ఒక్కొక్కరూ ఈ కామెంట్స్‌ పై ఎటాక్‌ చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ పై నాగబాబు చేస్తున్న కామెంట్స్ పై వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఇప్పుడు శ్రీరెడ్డి కూడా నాగబాబు కామెంట్స్ కు కౌంటర్ అన్నట్లుగా ఇండైరెక్ట్ గా పవన్ ను ఎటాక్ చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం...పవన్ అంటే మంచి పెయింటర్ అతడి గురించి యూట్యూబ్ లో కూడా ఉంటుంది. పెయింటర్ పవన్ తప్ప తనకు మరే పవన్ తెలియదని ఎంతో మంది పవన్ పేరుతో ఉంటారు వారందరి గురించి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ శ్రీరెడ్డి మరోసారి మెగా ఫ్యాన్స్ ను రెచ్చగొట్టింది. అంతేకాదు...సోషల్ మీడియా ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి వీడియోలను పోస్ట్ చేసింది. ఆ వీడియోల్లో పవన్ ను మరోసారి టార్గెట్ చేసింది. కొంతమంది నాతో పవన్ గురించి మాట్లాడమంటున్నారు. పవన్ అంటే దొంగ చూపులు చూస్తూ దొంగ కోళ్లు పట్టే వాడిగా ఉంటారంటా చదువు రాక కొన్ని సార్లు మహానుభావుల పేర్లను తప్పు చెప్పారు పైగా లక్ష పుస్తకాలు చదివానంటూ గొప్పలు చెప్పుకుంటారట. పెళ్లి మీద పెళ్లి చేసుకుని దేశానికి సేవ చేస్తున్నట్లుగా చెప్పుకుంటాడట. చిన్న పిల్లలను వెంటేసుకుని తిరుగుతూ తానో హీరోగా ఫీల్ అవుతారంట. ఇలాంటి వ్యక్తి జగన్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతారంట. మీ అన్నయ్య రాకముందు నుండే జగన్ గారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అభిమానులు తల్చుకుంటే మీరు ఎక్కడ ఉంటారో తెలుసుకోండి. తాను సీఎం అవుతానంటూ ప్రచారం చేసుకుంటూ అవివేకంగా తిరిగే వ్యక్తి.. ఈయనేనా పవన్ అంటే అంటూ శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. నాగబాబు బాలకృష్ణ ల వివాదంలో ఒక్కరొక్కరుగా ఇన్వాల్వ్ అవుతూ ఎవరికి వారు పబ్లిసిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ మరోసారి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌కు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాల్సిందే.