ఇక ఆపేస్తే బెటర్‌: ఫ్యాన్స్‌

11:43 - January 5, 2019

గత కొన్ని రోజులుగా ప్రత్యేకించి బాలకృష్ణను టార్గెట్ చేసిన నాగబాబు సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.  బ్లడ్ అండ్ బ్రీడ్ అంటూ ఒకసారి నిజాలు లేని బయోపిక్ ఎందుకని మరోసారి ఇలా గట్టి కౌంటర్లే వేసాడు నాగబాబు.  అప్పుడెప్పుడో బాలయ్య పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు అన్న దానికి రిటార్ట్ గా ఇప్పుడు నాగబాబు రివెంజ్ తీర్చుకోవడం కొందరు అభిమానులకు బాగానే ఉంది కాని ఇది నిజానికి మంచి కంటే ఎక్కువగా డ్యామేజ్ చేస్తోందన్నది నిజం. కాని ఫ్యాన్స్ మాత్రం వీటిని ఆపెయల్సిందిగా కోరుతున్నారు. ఫ్యాన్స్‌ ఇలా అనడానికి కారణం లేకపోలేదు. పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు రిలేషన్‌ విషియానికి వస్తే...వ్యక్తిగతంగా ఇతర వ్యవహారాల్లో పవన్ తరఫున మాట్లాడొచ్చు కాని ఇలా తమ్ముడు రాజకీయ పార్టీకి అద్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎంతో కొంత ఇబ్బంది కలిగించేవే. సోషల్ మీడియా అసలే ఇప్పుడు కాక మీదుంది. నిన్న సాయంత్రం ఓ అప్ కమింగ్ న్యూస్ ఛానల్ లో దీని గురించి రెండు గంటల పాటు అర్ధరహిత చర్చ పెట్టడం ఆలోచించాల్సిన విషయమే. దీన్ని ప్రతిష్టగానో అవమానంగానో  తీసుకుని ఫ్యాన్స్ తమ మనోభావాలను అనవసరంగా దెబ్బ తీసుకుంటారు. ఫైనల్ గా నష్టపోయేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎటకారంగా చేసినా దాని పర్యవసానం ఎంత దూరం వెళ్తోందో నాగబాబు ఇప్పటికైనా అర్థం చేసుకుని వీటికి చెక్ పెడితే బెటర్.