నా..లుగు కో.. ట్లే!

23:56 - August 17, 2018

          టాలీవుడ్లో నాలుగు హిట్లు పడితే చాలు కొంత మంది ఆకాశంలో విహారం చేస్తుంటారు. చాలాకాలం హిట్టు లేక అల్లాడిపోయిన ఓ యువ హీరో ఇప్పుడు వరుస్ హిట్లు కొడుతున్నాడు. అంతే కాదండోయ్ తన సినిమా రేటును కూడా అమాంతం పెంచేశాడట.. ఆ విశేషాల కోసం ఈ స్టోరీ చదవండి..
          హీరో నాగ శౌర్య చాలా రోజుల తరువాత తన సొంత బ్యానర్ లో ’చలో’ సినిమాతో  సూపర్ హిట్ కొట్టాడు. కాని ఆ సినిమా కూడా భారీ స్థాయిలో ధర పలకలేదు. ఐనప్పటికీ ’ఛలో’ సినిమా హిట్టు నాగశౌర్యకు  ఉత్సాహాన్నిచ్చింది. ఇగ ఇప్పుడు సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఛలో సినిమా తరువాత నాగశౌర్య వరుసగా రెండు ప్రయోగాలు చేశాడు. అమ్మమ్మగారి ఇల్లు, కణం సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలియాదు
        ఇక సొంత బ్యానర్ లో నర్తనశాల అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు శాటిలైట్ మార్కెట్ ఓపెన్ చేశారు. ఐతే నాగశౌర్య చెప్పిన రేటుకు శాటిలైట్ మార్కెట్ దిమ్మదిరిగిందట.  నర్తనశాల సినిమాకు ఏకంగా 4కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఐతే నాగశౌర్యపై అన్నికోట్ల శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తోంది. రేటుతగ్గితే ఎగరేసుకుపోయేందుకూ చాలా మంది ఎదురుచూస్తున్నట్లు టాలీవుడ్ టాక్. ఏమౌతుందో వెయిట్ అండ్ సీ..