పిల్లల్ని భయపెట్టే...మోమో బొమ్మ ఇకలేదు

16:54 - March 5, 2019

మోమో బొమ్మ.. ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మ క్రూరత్వం గురించి కథలు కథలుగా చెబుతారు. మోమో డాల్ సృష్టికర్త జపాన్ కు చెందిన కీసుకె ఐసో.  పిల్లల్ని విపరీతంగా భయపెట్టేలా ఈ బొమ్మను తీర్చిదిద్దారు. కొందరు దీన్ని చూసి ఆత్మహత్యకు ప్రయత్నించారంటే అతిశయోక్తి కాదు.  జపాన్ లోని టోక్కోలో మొదటిసారి 2016లో ఓ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. అప్పుడు పిల్లలందరూ భయం భయంగా చూడడం చూసిన కీసుకె ఐసో దీన్ని తయారు చేయడం ప్రారంభించారు. టోక్కో లో పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ఈ బొమ్మలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నాడు. ‘మదర్ బర్డ్’ అని ముద్దుగా పిలిచే దీనివల్ల చాలా మంది పిల్లలు ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారని గ్రహించి  ఈ బొమ్మ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసి కనుమరుగు చేయాలని దాని యజమానికి కీసుకె నిర్ణయించారు. 2018లో సౌత్ అమెరికా బ్రిటన్ దేశాల్లోనూ పిల్లలపై ఈ బొమ్మ ప్రభావం చూపింది. దీంతో దీన్ని గీసిన చిత్రకారుడు తను గీసిన బొమ్మ వల్ల ఆత్మహత్యలు జరగడాన్ని జీర్ణించుకోలేదు. అందుకే యజమాని కీసుకె తో కలిసి ఈ బొమ్మల ఉత్పత్తిని ఆపివేసి పూర్తిగా కనుమరుగు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఆన్ లైన్ మోమో బొమ్మతో ఎన్నో గేములు వీడియోలు వచ్చాయి. ఇవి పిల్లలను టార్గెట్ చేస్తూ వారి ఉసురు తీశాయి. మోమో చూసిన ఓ అమ్మాయి భయపడిపోయి తన తలను స్కూలు గోడకు కొట్టుకొని చనిపోయింది. అందుకే ఇక మోమో బొమ్మని సమాధి చేయడానికి యాజమాన్యం సిద్దమయిందట!