మోదీ మెడకు బిగుసుకుంటున్న రాఫెల్‌ ఉచ్చు...!

14:02 - February 9, 2019

మోదీ మెడకు రాఫెల్‌ ఉచ్చు బిగుసుకుంటోంది. రాఫెల్‌ పై ప్రతిపక్షాలు ఇంతకాలం చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా బట్టబయలు అయ్యింది. రాఫెల్‌ డీల్‌ బిగ్‌ స్కాంగా...దేశ ప్రజల నోర్లలో నానుతుంది. దాంతో మొన్నటి వరకు మోదీ హవా తగ్గుతున్నా...కాస్త అటు, ఇటు మెజార్టీతో గట్టెక్కేది...ఎన్డీయేనే అని ఘంటాపథంగా చెప్పిన విశ్లేషకులందరికీ ఇప్పుడు నోట మాట రావడంలేదు. ఇక వివరాల్లోకి వెలితే... రాఫెల్‌ డీల్‌ల్లోని నిజానిజాలపై నిన్నటి వరకూ అనుమానాలు ఉండే. రక్షణ రంగానికి చెందింది కదా....అందుకే రహస్యమేమో అని దేశ పౌరులంతా సర్దుకుపోయారు. ఇక అంతా సర్దుకున్నట్లే అని మోదీ పరివారం భావించింది. కానీ ఇంతలో ఒక కుదుపు...రాఫెల్‌ డీల్‌ ఒక బిగ్‌ స్కాం అంటూ... ఓ జాతీయ పత్రిక బయట పెట్టింది. ఇప్పుడు దేశ రాజకీయాలను రాఫెల్‌ రహస్య డీల్‌ ఒక కుదుపు కుదుపేస్తోంది. లోకసభ ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్న తరణం కావడంతో బీజేపీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రాంతీయ పార్టీలను కలుపుకోనైనా...ప్రధాని పీఠం పొందొచ్చు అనే వ్యూహాలకు దూరంగా విసిరివేయబడ్డది కమలం పువ్వు పార్టీ. దేశ భక్తికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా చెప్పుకునే బీజేపికి రాఫెల్‌ డీల్‌ తర్వాత ఏ ముఖం పెట్టుకొని భారత మాతాకీ జై అంటుందని...ఆ పార్టీలోని వారే ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. మోదీని నమ్ముకుంటే నట్టేట మునుగు ఖాయం అని తాజాగా గడ్కరీ పేరు తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ అంతా ఒకతను ముక్కలేనన్న నిజాన్ని ఎవ్వరూ దాచలేరుగా. రక్షణ రంగంలో పిఎంఓ జోక్యంతో మోదీకి కడుక్కోలేని బురద అంటుకుంది. ఎప్పుడూ బురదలో నుంచే...వికసిస్తానని చెప్పే మోదీ కమల వికాసం ఇప్పుడు నిలువెడు బురదలో కూరుకుపోయిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

లోకసభ ఎన్నికలపై రాఫెల్‌ ప్రభావం...

                      లోకసభ ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల గడువు...జాతీయ పార్టీలకు పరీక్ష కాలం. ఇలాంటి వేల ఎన్‌డిఏ సర్కారపై వచ్చిన నింద రాఫెల్‌. దానిపై ప్రతిపక్షాల దాడి ఎలా ఉన్నా...ప్రజల తీర్పు ఎలా ఉండనుంది?.
బీజేపీ నురిపేసే దేశభక్తిలో హిందుత్వానికే పెద్ద పీఠం. కానీ భారత్‌ మాతాకీ జై అటూ... ముక్త కంఠంతో పలికించడం ద్వారా అందరిలోనూ ఒకేలా దేశభక్తి రగిలించింది. అలాంటి బీజేపి ఇప్పుడు భారతమాతకు కాపుకాసే రక్షణ రంగంలోనే ద్రోహం తలపెట్టింది. ఇది బీజేపి ప్రేరేపిత దేశభక్తులకే కాదు...నిజమైన దేశభక్తులెవ్వరూ సహించరాని ఘటన. దీనిపై ప్రతిస్పందన కూడా అలాగే ఉంటోంది. బీజేపి దేశభక్తికి గీటురాయి తామే అన్నట్లు ఇంతకాలం వేసుకున్న ముసుగు తొలిగిపోసుంది. నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలే చేసిన ప్రజలు సహించారు. మన మోదీనేగా అని ఊరుకన్నారు. కానీ ఇప్పుడు దేశభక్తి విషయంలోనూ బీజేపి డొల్లతనం బట్టబయలు అయ్యింది. ఇక ఇప్పుడు బీజేపి వారు నమ్ముకునే రాముడు కూడా రక్షించడం కల్లనే. 2019 ఎన్నికల తర్వాత మోదీ ఖేల్‌ ఖతం, బీజేపి దుకాన్‌ బంద్‌...అని జాతీయ మీడియా తెగేసి చెబుతుంది.