రేపు హైటెక్‌ సిటీకి వచ్చేస్తున్న మెట్రో...

14:37 - March 19, 2019

హైటెక్ సిటీకి మెట్రో రైలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 9.15 గంటలకు  అమీర్ పేట మెట్రో స్టేషన్ లో గవర్నర్ నరసింహన్ జెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులను అనుమతిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. దీంతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాలం వచ్చేసిందని సాఫ్ట్‌వేర్‌, ఇతర ఉద్యోగులు అంటున్నారు. ఈ కారిటార్ తో మొత్తం 56 కి.మీల మేర మెట్రో అందుబాబులోకి రానుంది. ఇప్పటికే 46 కిమీల మెట్రో ప్రయాణంతో దేశంలోనే హైదరాబాద్ మెట్రో రెండో అతిపెద్ద కారిడార్ గా స్థానంలో నిలిచింది.  తొలి దశ ప్రతిపాదించిన 72 కిమీలలో మరో 15 కి.మీలు హైటెక్ సిటీ కారిడార్ తో అందుబాటులోకి వచ్చింది.  ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 9 కి.మీలు నిర్మాణంలో ఉంది.  ఈ ఏడాది చివరలో అది పూర్తి కానుంది.  మరో 6 కి.మీలు పాతబస్తీ మార్గంలో ఇంకా పనులు ప్రారంభం కాలేదు.