"సూర్యకాంతం" కూడా అట్టర్ ఫ్లాప్: మెగా హీరోయిన్ కెరీర్ ఆగిపోనుందా? 

14:34 - April 2, 2019

*నిహారిక మూడో చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ 


*ఏమాత్రం కలెక్షన్లు లేని "సూర్య కాంతం"


*ఇక మెగా హీరోయిన్ కెరీర్ ఆగిపోనుందా? 


*మెగా ఫ్యామిలీ నుంచి రావటమే నిహారికకి సమస్య అయ్యింది

 

 

 

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఎంతపని చేస్తుందో దానికి సమానంగా కష్టం, తపన, ఉంటేతప్ప ఎదగటం కష్టం. ఈ విషయం అటు బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్, ఇటు టాలీవుడ్ లో తారక రత్న ఎప్పుడో నిరూపించేసారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే టాలెంట్ లేకుండా కొనసాగటం కష్టమైన ప్రదేశం. ఏ చిన్న తప్పటడుగు పడ్డా, ఏ ఒక్క పొరపాటు జరిగినా ఇక కెరీర్ మీదే దెబ్బ పడుతుంది. దీనికి ఉదాహరణలు చాలా మంది వారసుల్లో చూసాం.   

                                                                   
ఇప్పుడు  మెగా ఫ్యామిలీ నుంచి కథానాయికగా మారిన తొలి అమ్మాయి నిహారిక పరిస్థితికూడా అయోమయంగా ఉంది. కుటుంబంలోనే వద్దని చెప్తున్నా చిరంజీవి సహా అందరినీ ఒప్పించి సినీ రంగ ప్రవేశం చేసిందామె. కానీ ఆమెకు ఇక్కడ ఆశించిన ఫలితాలు రాలేదు. తొలి సినిమా ‘ఒక మనసు’.. రెండో చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’ పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఇప్పుడు నిహారిక ఆశలన్నీ ‘సూర్యకాంతం’ మీదే పెట్టుకుంది.   

కానీ ఈ చిత్రం నిహారిక తొలి రెండు సినిమాల స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోయింది. అసలేమాత్రం బజ్ లేకుండా రిలీజైన ‘సూర్యకాంతం’ ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. బ్యాడ్ టాక్ రావడంతో తొలి రోజే థియేటర్లు వెలవెలబోయాయి. వీకెండ్లో కూడా సినిమా ఏమాత్రం జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయింది. మూడు రోజులు నామమాత్రంగా నడిపించి అప్పుడే సినిమాను థియేటర్ల నుంచి లేపేస్తున్నారు. తెలంగాణ వరకు దీనికి పోటీగా విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నెగెటివ్ టాక్‌ను తట్టుకుని కూడా బాగానే వసూళ్లు రాబడుతుండగా ‘సూర్యకాంతం’ థియేటర్లు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. 

                                                               

నిహారిక పట్ల జనాలకు ఏమాత్రం ఆసక్తి లేదన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రణీత్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటించాడు. వరుస మూడో ఫ్లాప్ ఎదురైన నేపథ్యంలో నిహారిక కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది. నిజానికి నిహారిక కెరీర్ కి అతిపెద్ద అడ్డంకి ఆమె మెగా ఫ్యామిలీకి చెరందిన అమ్మాయి కావటమే.

                                                                

గ్లామర్ ప్రధానంగా సాగే ఈ ఇండస్ట్రీలో. 90% జనాలకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ "అన్నయ్య" ల స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఆమెకి గ్లామర్ హీరోయిన్ గా చేసే అవకాశం లేదు. పోనీ వేరే జోవియల్ గా ఉండే ప్రత్యేక పాత్రలేమైనా చేద్దామా అంటే అంటే అంత పెద్ద యాక్టర్ల ఫ్యామిలీనుంచి వచ్చి చిన్న పాత్రలు చేయటం బావుండదు. సో..! ఏ రకంగా చూసినా పాపం నిహారిక కి ఈ రమంగంలో నిలదొక్కుకునే అవకాశమే లేదు... పాపం