పెళ్లి పిల్ల కోసం పల్లె బాట పడుతున్న సాఫ్ట్‌వేర్‌లు..ఎందుకో తెలుసా?

14:24 - April 26, 2019

కొంత కాలం కిందట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వస్తే చాలు జీవితం బిందాస్‌గా వుంటుందని చెప్పి అందరూ ఆ ఉద్యోగాల కోసం ఎగబడేవారు. అంతేకాదు అందులోనే పనిచేసే పిల్లను పెళ్లి చేసుకుంటే రెండు చేతులనిండా డబ్బే డబ్బు అనుకుంటూ పెళ్లిల్లు చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అది రివర్స్‌ అయింది. అదేలా అనుకుంటున్నారా... ఒక్కసారి ఈ వార్తలను చూస్తే తెలుస్తుంది. ‘‘కరీంనగర్ జిల్లా కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఇటీవలే హైదరాబాద్ లోనే మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన అమ్మాయి సంబంధం ఖాయం చేశారు పెద్దలు.. కానీ అతడు ససేమిరా అని.. ఓ మారుమూల మండలంలో డిగ్రీ చదివిన అమ్మాయిని వివాహమాడాడు.’’ అంతేకాదు ఇలాంటిదే మరో వివాహం జరిగింది. ‘ ఖమ్మం జిల్లాకు చెందిన టెకీ కూడా సాఫ్ట్ వేర్ జాబ్ లో ఉండి.. లక్షల జీతం వచ్చినా కూడా ఆ రంగంలోని అమ్మాయిని కాకుండా తన మేనమామ కూతురునే చేసుకున్నాడు..’. ఇలా ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా...దీనికి కారణం లేకపోలేదు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటేనే కత్తిమీద సాములాంటి జాబ్. ఇక్కడ అత్యంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడితో సంసారాలు కూడా చేయని వారు ఎందరో.. తాగుడుకు బానిసై సాయంత్రాలు పార్టీలు - పబ్బులంటూ తిరుగుతూ కుటుంబ జీవితాలకు దూరమవుతుంటారు. అది కాస్తా విడాకులకు దారి తీస్తుంది. భార్య - భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయిన 80శాతం కాపురాలు కూలిపోతున్నాయంటే వారి మధ్యన అండర్ స్టాండింగ్ ఎంత దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు టెకీలు మారారు. అందుకే సాఫ్ట్ వేరర్లంతా ఇప్పుడు తమ కాపురాలు కలకాలం నిలబడాలంటే.. తమ సంసార సుఖం కొన్నాళ్లు సాగాలంటే పల్లెటూరి పిల్లే ముద్దు అంటున్నారట..సాఫ్ట్ వేర్ నౌకరీ చేసే అమ్మాయి వద్దు.. తమకు ఇంట్లో ఉండి వండిపెట్టే హౌస్ వైఫ్ లాంటి పిల్ల ముద్దు అంటున్నారు. పల్లెటూరి పిల్ల అయితే ఇంకా మంచిదంటున్నారు. ఎందుకంటే సిటీల్లో పెరిగిన అమ్మాయిలు కాస్త దూకుడుగా ఉంటారు. అనుకువగా ఉండరు. అర్థం చేసుకునే మనస్తత్వం తక్కువ. అదే పల్లెటూళ్లో పెరిగిన వారికి కాస్త అనుకువ - వినయం - అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుందట..అందుకే...ఇలా పల్లెటూరి పిల్ల కోసం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు వెతుకులాడుతుండడం.. పెళ్లిళ్లు చేసుకుంటుండడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.