"మణికర్ణిక" స్పెషల్ షో: రాష్ట్రపతితో కోసమే "మణికర్ణిక

11:55 - January 18, 2019

కొన్నేళ్ళుగా ఇండియన్ సినిమాని ఏలుతున్న ఫార్ములా బయోపిక్ ఇదే ట్రెండ్ లో భాగంగా  భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయి జీవిత కథ ఆధారంగా ‘మణికర్ణిక’ సినిమాను తెరకెక్కించారు. ఝాన్సీ లక్ష్మీ భాయి అసలు పేరు ‘మణికర్ణిక’. ఈ టైటిల్‌తోనే ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్స్‌తో పాటు ఈ మూవీ టీజర్‌,ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించారు. అనేక వివాదాలు, మరెన్నో వాయిదాల తరువాత షూటింగ్ పూర్తి చేసుకున్న మణికర్ణిక ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌తోపాటు పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 


ఈ సందర్భంగా ‘మణికర్ణిక’ చిత్ర యూనిట్ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోసం ఢిల్లీలో ఈ రోజు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసారు.మీరు చదివింది  ఈసినిమాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీక్షించనున్నారు. ఆయన కోసం ఈ నెల 18న సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్రయూనిట్. ఈ ప్రదర్శనకు కంగనాతో పాటు చిత్రయూనిట్ అంతా హాజరు కానుంది. అయితే టీంతో పాటు దర్శకుడు క్రిష్‌ హాజరవుతారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మణికర్ణిక సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఈ స్పెషల్‌కు కంగనా రనౌత్‌ పాటు ‘మణికర్ణిక’ టీమ్‌ మొత్తం హాజరు కానుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో వెల్లడించారు.