ఒళ్ళు గగుర్పోడిచేలా: మణికర్ణిక తెలుగు ట్రైలర్

14:51 - January 4, 2019

 

 

 

 

 

 

 

గత రెండేళ్ళుగా టాలీవుడ్ స్టార్ డరెక్టర్లలో ఒకడైన  క్రిష్ బాలీవుడ్ లోకి ఎంటర్ కావటానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా "మణికర్ణిక" కంగన ఈ సినిమా వల్ల కొన్ని చిక్కుల్లో ఇరుక్కున్నా ఎట్టకేలకు సినిమాని పూర్తి చేసేసారు. ఝాన్సీ లక్ష్మీ భాయి అసలు పేరు ‘మణికర్ణిక’. ఈ టైటిల్‌తోనే ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కొంత భాగానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. మిగిలిన భాగానికి కంగన దర్శకత్వం వహించింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్స్‌తో పాటు ఈ మూవీ టీజర్‌,ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు తాజాగా తెలుగు, తమిళ వెర్షన్ ట్రైలర్ ని కూడా వదిలారు. ఊహించని రెస్పాన్స్ కూడా ఉంది. అయితే ఈ సినిమాకి వాడిన సెట్స్, కొన్ని స్టంట్స్ బాహుబలిని గుర్తు చేస్తున్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. 
       

కంగనా ఏనుగు మీదకి ఎక్కటం, "లక్ష్మి భాయి అనే నేను..." అంటూ ప్రమాణ స్వీకారం సమయంలో వినిపించే డైలాగ్. బాహుబలి నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా అనిపించేలా ఉన్నాయి.  అయితే ఈ ట్రైలర్లోనే దాదాపు మొత్తం సినిమా అర్థమయ్యేలా చూపించేసారు. నిజానికి కథ అందరికీ తెలిసిందే కావటం వల్ల ఊహించని మలుపులతో ట్రైలర్ చేయటం సాధ్యం కాద్ అందుకే మొత్తం సినిమాలోని బావున్న సీన్లతో ట్రైలర్ కట్ చేసారు. ఆంగ్లేయ ప్రభుత్వం గద్దల్లాగా ఝాన్సీపై దృష్టి నిలిపి కూర్చుంది. ఝాన్సీకి సరైన సమయంలో వారసుడు లభించకుంటే.. వారు ఝాన్సీని కూడా ఆక్రమిస్తారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభమవుతుంది.
 
మణికర్ణిక గా ఉన్న యువరాణి ఎలా ఝాన్సీ లక్ష్మీబాయిగా మారింది, ఆమె చూపించిన తెగువ, స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పాత్ర తదితర అంశాలను ట్రైలర్‌లో చాలా బాగా చూపించారు. ‘మనం పోరాడుదాం.. దాని వల్ల భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి’ వంటి కంగన చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ప్రతి భారతీయుడిలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చే కాగడాను అవుతాను నేను’ అంటూ కంగన చెప్పే డైలాగ్ స్ఫూర్తిని రగిలిస్తోంది. ఇక మాతృమూర్తి, మహాయోధురాలు కథను చాలా అందంగా స్ఫూర్తిదాయకంగా రూపొందించారు. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథను అందివ్వటం విశేషం. ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.