జయలలిత బయోపిక్ "ఐరన్ లేడీ" హైదరాబాద్ లోనే :రామోజీ ఫిలిం సిటేలో భారీ సెట్

16:47 - January 10, 2019

తమిళ రాజకీయాలను ఒక ఊపు ఊపిన "పురచ్చి తలైవి" ఒకనాటి పాపులర్ సినీస్టార్ కూడా అన్నవిషయం తెలిసిందే కదా. 1960 మ‌ధ్య కాలంలో టాప్ హీరోయిన్‌గా అలరించిన అందాల న‌టి జ‌య‌లలిత. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌,భాష‌ల‌లో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది పురుచ్చతలైవీ.  నటిగా మొదలై ఒక రాష్ట్ర రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రిగా, దేశంలోనే ముఖ్య రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచిన జయలలిత జీవితం లో సినిమాకి సరిపడినన్ని మలుపులూ, కావాల్సినంత మెలో డ్రామా ఉంది.

భార‌త రాజ‌కీయాల‌లోను ముఖ్య భూమిక పోషించిన జ‌య‌ల‌లిత దాదాపు 14 సంవత్స‌రాల‌కి పైగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించింది. త‌మిళ తంబీలు అమ్మ‌గా పిలుచుకొనే జ‌య‌ల‌లిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆమెపై బ‌యోపిక్ రూపొందించేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు స‌న్నాహాలు చేస్తున్నారు.  


 ఈ రేసులో మహిళా దర్శకురాలు ప్రియదర్శిని ముందంజలో ఉన్నారు. నిత్యామీనన్ జయలలిత పాత్రలో బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జయలలిత పాత్రకి గాను నిత్యా మీనన్ ను, ఎంజీఆర్ పాత్రకి గాను మలయాళ నటుడు సుకుమార్ ను, శశికళ పాత్రకి గాను వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసుకున్నారు ఈ చిత్రానికి ది ఐరన్ లేడీ అని టైటిల్ కూడా ఖరారు చేసి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ ఈ చిత్రాన్ని వేగంగా చిత్రీకరించాలని దర్శకురాలు భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ది ఐరన్ లేడి చిత్ర షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుందట.  

ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోందట. 2016 డిసెంబర్ 5న జయలలిత చెన్నైలో అనారోగ్యం కారణంగా మృతి చెందారు. మరి కొందరు దర్శకులు కూడా జయలలిత బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రియదర్షిని తీస్తున్న "ఐరన్ లేడీ" నే అన్నిటికన్నా ముందు రిలీజ్ అవ్వొచ్చు.