మహేష్‌కి షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

16:21 - February 20, 2019

 సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్‌ ఇచ్చారు.  ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్‌ అతిక్రమించిందని వార్తలు వెలువడుతున్నాయి. రూ.100 ఆ పైన టికెట్‌కు గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. జనవరి 1 నుంచి 18 శాతానికి, రూ.100 లోపు టికెట్‌పై 18 శాతాన్ని కాస్తా 12కు తగ్గించింది. అయితే ఏఎంబీ మాల్‌ మాత్రం తగ్గించిన ధరలు అమలు చేయకుండా అక్రమంగా ప్రేక్షకుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  దాంతో థియేటర్‌పై కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితమే బ్రాండ్ల నుంచి వస్తున్న పారితోషికాలపై పన్ను ఎగ్గొట్టారంటూ మహేశ్‌కు నోటీసులు అందాయి. ఆయన బ్యాంక్‌ ఖాతాలను కూడా సీజ్‌ చేశారు.