మహేష్‌ మాటలతో మనస్తాపానికి గురైన సుకుమార్‌...

13:23 - May 5, 2019

‘మహర్షి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.అయితే మహేష్‌ చేసిన వ్యాఖ్యలకి సుకుమార్‌ మాత్రం బాగా మనస్తాపానికి గురయ్యాడట. అసలు అంతగా మహేష్‌ ఆ ఫంక్షన్‌లో మాట్లాడిన మాటలేంటి అనుకుంటున్నారా...అయితే వివరాల్లోకి వెలితే...‘మహర్షి’ సినిమాలో తాను నటించడం కోసం వంశీ పైడిపల్లి రెండేళ్లు ఎదురు చూశాడని.. కానీ కొందరు దర్శకులు రెండు నెలలు కూడా ఎదురు చూడలేక కథ పట్టుకుని వేరే హీరో దగ్గరికి వెళ్లిపోతున్నారని మహేష్‌ అన్నారు. ఐతే ఈ వ్యాఖ్యల వెనుక మహేష్ ఉద్దేశం ఏమిటో కానీ.. సుకుమార్ మాత్రం వీటి వల్ల మనస్తాపానికి గురైనట్లు సమాచారం. సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మహేష్ కోసం తాను ఎదురు చూసింది రెండు నెలలు కాదని.. దాదాపు ఏడాది అని సుక్కు అన్నాడట. అందులో స్క్రిప్టు పని కోసం సమయం పట్టినప్పటికీ.. మహేష్ కూడా అందుబాటులోకి రావడానికి ఆలస్యం జరిగిందన్నది సుక్కు మాట. ఇక సినిమా మొదలుపెడదాం అనే సమయానికి అనిల్ సినిమాను మహేష్ ముందుకు తెచ్చాడని - అదయ్యాక తనతో సినిమా చేస్తానని చెప్పాడని సుక్కు అంటున్నాడట. ఇదిలావుంటే ...అనిల్ సినిమాను తన సినిమాను ఒకేసారి చేస్తా అని మహేష్‌ అనగా.. లుక్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉండాల్సిన నేపథ్యంలో అలా కుదరదని చెప్పి తాను ఈ సినిమాను రద్దు చేసుకునే ప్రపోజల్ ముందు పెట్టానని.. మహేష్ కూడా ఓకే అన్నాడని.. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తోనే సినిమాను క్యాన్సిల్ చేసుకోగా మహేష్ వేరే ఉద్దేశంతో తనపై సెటైర్ వేయడం ఏంటని సుక్కు ఆవేదన చెందాడట.