ఎవరు నిజం, ఎవరు బొమ్మ? :మహేష్ బాబు మైనపు బొమ్మ వద్ద అభిమానుల సందడి

12:58 - March 25, 2019

అంతులేని జనాకర్షణ పొందిన సెలబ్రిటీలకు మైనపు బొమ్మల్ని ప్రతిష్టించే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో సూపర్ స్టార్‌కి చోటు దొరకబోతోంది. నిజానికి.. ఈ మేరకు ఏప్రిల్ నెలలోనే మహేష్ బాబు క్లారిటీ ఇచ్చేసినప్పటికీ. మహేష్ మైనపు ప్రతిమ తయారీకి ఇంత సమయం పట్టింది. ఇక ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు రూపొందించిన మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ విగ్రహం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్‌లో అభిమానులు, మీడియా సందర్శనార్థం ఉంచారు. కొద్ది సేపటి క్రితమే విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ ఫ్యాన్స్ పెద్దఎత్తున వచ్చి వీక్షించారు. విగ్రహావిష్కరణకు వచ్చిన సూపర్ స్టార్. తన మైనపు బొమ్మతో సెల్ఫీ దిగుతూ సందడి చేశారు. మైనపు బొమ్మ పక్కన మహేష్ నిల్చొని అచ్చం అదే స్టిల్‌తో ఫోజులిచ్చారు. అయితే ఇద్దరు మహేష్‌లను ఒక్కచోట చూసిన అభిమానులు ఇంతకీ ఎవరు నిజం, ఎవరు విగ్రహం అనేది అర్థంకాక తికమక పడుతున్నారు.  

మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటివరకు చోటు దక్కించుకున్న ఒక్కే ఒక్క తెలుగు నటుడు ప్రభాస్ కాగా, ఇప్పుడు మహేశ్ బాబు కూడా ఆ సరసన చేరనున్నాడు. 
 ఇక బాలీవుడ్ విషయానికి వస్తే అమితాబ్, షారూఖ్, కరీనా, సల్మాన్, సచిన్, గాన్ధేజీ, ఇందిరాగాంధీ ఇలా చాలామంది మైనపు బొమ్మలే ఉన్నాయి అయితే ఇవన్నీ లండన్ లోఇ మ్యూజియం లో ఉండగా ఇప్పుడు మహేష్ బాబు విగ్రహం మాత్రం సింగపూర్లో ఉన్న మ్యూజియంలోకి చేరనుంది. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ‘మేడం టుస్సాడ్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 23 శాఖల్లో అంతర్జాతీయ ప్రముఖుల మైనపు ప్రతిమలు తయారు చేసి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులకు వారి అభిమాన ప్రముఖుల్ని కలిసే అనుభూతిని ఇస్తోంది.