రంగస్థలంని ఇప్పుడైనా క్రాస్‌ చేస్తుందా...?

15:22 - May 8, 2019

ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ సమయంలోనే మహర్షి రచ్చ షురు కాబోతోంది. భరత్ అనే నేను గత ఏడాది బ్లాక్ బస్టర్ అనిపించుకుంది కాని దాని కన్నా జస్ట్ ఇరవై రోజుల ముందు వచ్చిన రంగస్థలంని దాటలేకపోయింది. మరి ఇప్పుడు మహర్షి అయినా రంగస్థలంని క్రాస్‌ చేస్తుందా? అనే టాక్‌ వస్తుంది. ఇది సాధ్యమైతే బాహుబలిని కనీసం మెయిన్ సెంటర్స్ లోనైనా టార్గెట్ చేయొచ్చు. కాని ఇది పైకి చెప్పుకున్నంత ఈజీ కాకపోవచ్చు. మహర్షి కేవలం మహేష్ ఇమేజ్ మీద సేల్ అయ్యింది. వంశీ పైడిపల్లికి తన పేరు మీదే మార్కెట్ చేసుకునే రేంజ్ లేదు. ముగ్గురు అగ్ర నిర్మాతలు కాబట్టి బడ్జెట్ విషయంలో రాజీ పడకపోయినా ఇప్పుడు దీన్ని తీరాన్ని చేర్చాల్సిన భారం మహేష్ మీదే ఉంది. టికెట్ రేట్లు పెంచడం ఐదు షోలు వేయడం బాగా హెల్ప్ చేసేలా ఉన్నాయి. రంగస్థలం, బాహుబలిలను టార్గెట్‌ చేయడం బాగానే వుంది. కానీ ఆ సినిమాల్లోని అంశాలను మించి ఇందులో యూనిక్‌ అంశాలు ఇందులో ఉన్నాయన్న టాక్ బయటికి రావాలి. అప్పుడే సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే ఆడియో పరంగా మహర్షి అద్భుతాలు చేయలేకపోయింది. ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది కాని యునానిమస్ గా వావ్ అనిపించుకోలేదు. సో ఈ ప్రతికూలతలన్ని రేపు అసలు కంటెంట్ తో కొడితే అవన్నీ మర్చిపోయి మరీ ప్రేక్షకులు కనక వర్షం కురిపిస్తారు. మరి మహర్షి ఆ రేంజ్ లో హంగామా చేయాలి మరి.