కుంభమేళాలో పేలిన సిలిండర్: వేడుకల ప్రారంభంలోనే అపశ్రుతి

05:47 - January 16, 2019

 ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్)లో కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. హిందువుల కాలమానం ప్రకారం సూర్యుడు మకర రాషిలో ప్రవేశించగానె ప్రయాగ్‌రాజ్‌లో అర్ధకుంభమేళా మహాక్రతువు ప్రారంభమైంది. త్రివేణి సంగమంలో మంగళవారం (జనవరి 15) ఉదయం 5.15 గంటలకు మొదటి రాజయోగ స్నానాలతో ప్రారంభమైన ఈ కుంభమేళా మార్చి 4 వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. ఆధ్యాతిక - రాజకీయ - పర్యాటక సంగమమైన ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు తరలివస్తున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈసారి కుంభమేళా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎనిమిది వారాలు సాగే కుంభమేళాకు దాదాపు 10 లక్షల మంది విదేశీ పర్యాటకులు సహా సుమారు 15 కోట్ల మంది హాజరవుతారని అంచనా. 

ఆధ్యాతిక - రాజకీయ - పర్యాటక సంగమమైన ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు తరలివస్తున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈసారి కుంభమేళా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎనిమిది వారాలు సాగే కుంభమేళాకు దాదాపు 10 లక్షల మంది విదేశీ పర్యాటకులు సహా సుమారు 15 కోట్ల మంది హాజరవుతారని అంచనా.
 
యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ప్రభుత్వం కొత్తగా 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 పంటూన్ వంతెనలు, 40 వేల ఎల్‌ఈడీ బుల్బులు, నది పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో గుడారాలు ఏర్పాటు చేసింది. ఆ గుడారాల్లో అన్ని రకాల వసతులను కల్పించిన యూపీ ప్రభుత్వం ఏకంగా ఒక నగరాన్నే నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక నగరమని ప్రభుత్వం వెల్లడించింది. వీటి నిర్వహణకు రూ.2,800 కోట్లు కేటాయించింది యోగీ సర్కార్.  
కాగా కుంభమేళా ప్రారంభం కావడానికి ముందే ఆ ప్రదేశంలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ మహా సమ్మేళనం జరిగే ప్రదేశంలోని దిగంబర్ అఖారా వద్ద సోమవారం ఓ వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆరు అగ్నిమాపక శకటాలు ఎనిమిది అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

కుంభమేళా పాలనాయంత్రాంగంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సాయంతో అగ్నిమాపక సిబ్బంది కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపు చేశారని పోలీసులు వివరించారు. తొలుత పక్కనే ఉన్న ఓ గుడారంలో మంటలు చెలరేగాయని ఆ తర్వాత అవి తమ శిబిరంలోని వంటశాలకు వ్యాపించాయని దిగంబర్ అఖారా అధిపతి తెలిపారు.