2019కి ముందడుగేసిన కాంగ్రెస్: అభ్యర్థుల తొలి జాబితా విడుదల

23:23 - March 7, 2019

*15 మందితో కూడిన తొలి జాబితా విడుదల 

*రాహుల్ అమేథీ, సోనియా రాయ్ బరేలీ నుంచీ పోటీ 

*ప్రియాంకా గాంధీ ఎక్కడ అన్నది ఇప్పటికి రహస్యమే 

 

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ  ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో పడ్డాయి. ఈ వారంతంలో లేదా వచ్చే వారం ఆరంభంలో ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో 7-8 దశల్లో ఎన్నికలను నిర్వహించే వీలుంది.  ఎక్కడ ఎవరికి ప్రాభల్యం ఉందీ ఎవరు గెలుపుని తెచ్చే సత్తా ఉన్నావాళ్ళూ అంటూ తమ తమ పార్టీల్లోని అభ్యర్థు;ల బలాబలాలను లెక్క వేసుకునే పనిలో పడ్డాయి.

అయితే ఈసారి యువనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో వేగం ప్రదర్శిస్తోంది. మిగతా పార్టీలన్నీ ఇంకా అభ్యర్థుల ఎంపికలో ఉండగానే కాంగ్రేస్ 15 మందితో కూడిన తొలి జాబితాని ప్రకటించేసింది.  తొలి జాబితాలో భాగంగా.. గుజరాత్ నుంచి నాలుగు స్థానాలకు, యూపీ నుంచి 11 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి అభ్యర్థులను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించింది.

15మందితో కూడిన ఈ జాబితాలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఉన్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేయబోరేమో అంటూ జరుగుతున్న చర్చకు బ్రేక్ పడింది. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరులేదు. ఇక, రాహుల్ గాంధీ, సోనియా తమకు అచ్చొచ్చిన అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ప్రకటించిన జాబితా ప్రకారం.... 


గుజరాత్ – అహ్మదాబాద్ వెస్ట్ (ఎస్సీ)  – రాజు పర్మార్

గుజరాత్ – ఆనంద్ భరత్ సింగ్ – సోలంకి

గుజరాత్ – వడోదరా – ప్రశాంత్ పటేల్
 
గుజరాత్ – చోట ఉదయ్‌పూర్ (ఎస్టీ) – రంజిత్ మోహన్ సింగ్ రత్వా

ఉత్తర్‌ప్రదేశ్ – సహారాన్‌పూర్ – ఇమ్రాన్ మసూద్

ఉత్తర్‌ప్రదేశ్ – బదౌన్ – సలీమ్ ఇక్బాల్ షేర్వాణీ

ఉత్తర్‌ప్రదేశ్ – ధౌరాహ్రా – జితిన్ ప్రసాద్
 
ఉత్తర్‌ప్రదేశ్ – ఉన్నావ్ – అన్ను టాండర్

ఉత్తర్‌ప్రదేశ్ – రాయబరేలి – సోనియా గాంధీ

ఉత్తర్‌ప్రదేశ్ – అమేథీ – రాహుల్ గాంధీ

ఉత్తర్‌ప్రదేశ్ – ఫరూకాబాద్ – సల్మాన్ ఖుర్షీద్

ఉత్తర్‌ప్రదేశ్ – అక్బర్‌పూర్ – రాజారాం పాల్

ఉత్తర్‌ప్రదేశ్ – జలౌన్ (ఎస్సీ) – బ్రిజ్‌లాల్ ఖబ్రి

ఉత్తర్‌ప్రదేశ్ – ఫైజాబాద్ – నిర్మల్ ఖత్రి

ఉత్తర్‌ప్రదేశ్ – ఖుషీనగర్ – ఆర్‌పీఎన్ సింగ్