యాపిల్ ముక్క ఆ చిన్నారి జీవితాన్ని తినేసింది: పిల్లల విషయంలో జాగ్రత్త

16:00 - April 4, 2019

చిన్నారులకు ఏదైనా తినిపించే సమయంలో  సరైన పద్దతిలో ఇవ్వకపోతే మాత్రం ఇదిగో ఇలా బాధపడక తప్పదు. ఆ చిన్నారి మీద ప్రేమతోనే అయినా డే-కేర్ సెంటర్ అమ్మాయి చేసిన చిన్న పొరపాటు వల్ల ఒక చిన్నారి జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమయ్యింది. న్యూజిలాండ్‌లోని రొటారులో నివసిస్తున్న రెండేళ్ల బాలుడు నిహాన్ రెనాటా ఆపిల్ ముక్క కొరకబోవటం వల్ల అతని జీవితమే తలకిందులయ్యింది. రెంటా తల్లితండ్రులిద్దరూ డాక్టర్లు కావటం వల్ల అతన్ని డేకేర్ సెంతర్లో వదిలి వెళ్ళేవాళ్ళు ఓ రోజు టీచర్ రెనాటాకు యాపిల్ ముక్క ఇచ్చి తినమంది. కానీ ఇంకా పళ్ళు కూడా సరిగా రాని ఆ చిన్నారి దాన్ని పూర్తిగా నమలలేక అలనే మింగే ప్రయత్న చేసాడు. 

యాపిల్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక రెనాటా ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత అతడికి గుండె నొప్పి వచ్చింది. దీంతో డే-కేర్ సిబ్బంది రెనాటాను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిసేపటి తర్వాత అతడి శరీరంలో కదలిక లేదు. కాళ్లు, చేతులు, శరీరంలోని అన్ని భాగాలు చచ్చుపడిపోయి పక్షవాతానికి గురయ్యాడు. ఊపిరి అందకపోవడంతో రెనాటా బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రెనాటాకు రెండు నెలలపాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. అయినా.. ఫలితం లేకపోయింది. అప్పటి నుంచి ఆ రెనాటా వీల్ ‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. ఎటూకదలేని స్థితిలో ఉండటం వల్ల అతన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. రెనాటా తల్లి కూడా డాక్టరే. తన కుమారుడికి ఆ పరిస్థితి వచ్చిన రోజు నుంచి ఆమె ఉద్యోగం వదిలి ఇంటికే పరిమితమైంది. 24 గంటలు అతడి బాగోగులు చూసుకుంటోంది.  

ఈ ఘటన 2016లో చోటుచేసుకుంది. ఇప్పుడు రెనాటాకు ఐదేళ్లు. ఇప్పటికీ అతడు కోలుకోలేదు. భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ. సాధారణంగా మూడేళ్ల కంటే తక్కువ వయస్సు ఉండే చిన్నారులకు యాపిల్ పండ్లను తినిపించకూడదు. ఆ ముక్కలను వారు కొరకలేరు. అంతేకాదు వారి అరచేతి సైజుకన్నా చిన్నగా ఉండ్Fఏ వస్తువులనూ, బొమ్మలనూ వారికి దూరంగా ఉంచాలి. కొన్ని సార్లు మనం ప్రేమగా చేసిన పనులే వాళ్ళ జీవితాలను దారుణమైన మలుపు తిప్పే ప్రమాదం ఉంది...