అన్నంతో పాటు పసివాల్లకూ మద్యం పంచారు : బాజాపా నేతల నిర్వాకం, దేవాలయం లోనే...

17:18 - January 8, 2019

భారత దేశ రాజకీయాలకూ మధ్యానికి ఉన్న అనుబందం ఏమిటో ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన పనేమీ లేదు. కానీ మరీ బహిరంగంగా సభకు వచ్చిన చిన్న పిల్లలకు కూడా లిక్కర్ బాటిళ్లను పంచటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇంతకీ ఇదేక్కడా అంతే... యూపీలో బీజేపీ నేతలు ఓ కార్యక్రమానికి వచ్చిన వారికి ఆహారపొట్లాలతో కలిపి మందుబాటిళ్లు పంపిణీ చేశారు.ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్‌లో ఈ సంఘటన జరిగింది. హర్దోయ్‌కు చెందిన భాజపా ప్రజా ప్రతినిధి నితిన్‌ అగర్వాల్‌. ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. శ్రావణ దేవి ఆలయంలో సోమవారం బీజేపీ ఎమ్మెల్యే నితిన్‌ అగర్వాల్ సారథ్యంలో ‘పాసి సమ్మేళన్‌’ (పాసీ అనేది అక్కడ ఒక కులానికి చెందిన పేరు) పేరుతో సభ పెట్టారు. తర్వాత హాజరైన పెద్దలకు పిల్లలకు లంచ్ బాక్సులు అందించారు. అయితే ఆ పాకెట్లను తెరిచేసరికి ఆహారంతోపాటు అందులో మద్యం సీసాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నితిన్ అగర్వాల్ స్టేజీపై నుంచి మాట్లాడుతూ. ఆహార పొట్లాలు గ్రామ పెద్దలకు ఇస్తారు. ఆ ప్యాకెట్లను గ్రామపెద్దలు వారితోపాటు ఉన్న వారికి పంపిణీ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆహార పొట్లాలను ఇద్దరు మైనర్లకు కూడా పంపిణీ చేయడం గమనార్హం. నాకు ఓ ఆహారపొట్లాన్ని ఇచ్చారు. అందులో మందు బాటిల్ ఉంది. నితిన్ అగర్వాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్యాకెట్‌ను ఇచ్చారని అక్కడున్న ఓ వ్యక్తి చెప్పాడు. నేను మా నాన్నతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చాను. నితిన్ అగర్వాల్‌కు సంబంధించిన వ్యక్తులు ప్యాకెట్లను నాకు ఇచ్చారని ఓ బాలుడు చెప్పుకొచ్చాడు. మామూలుగానే హాజరైన మగాళ్ళకి ఆనందంగానే అనిపించినా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు కూడా మందు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు. హర్దోయ్ బీజేపీ ఎంపీ అన్షుల్ వర్మ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆహారపొట్లాల్లో మందుబాటిళ్లు సరఫరా చేసిన ఘటనపై పార్టీ నేతలతో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్షుల్ వర్మ అన్నారు. అయితే దీని వెనుక తమ ప్రమేయం లేదన బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల కిందట సమాజ్‌వాది పార్టీ నుంచి బీజేపీలో చేరిన నితిన్‌ తండ్రి నరేష్‌ అగర్వాల్‌ ఆదేశాలతోనే మందు పంపిణీ చేశారని హర్దోయ్ పీ అన్షుల్ వర్మ ఆరోపించారు. సదరు లంచ్ బాక్సులను పల్లెలకు తీసుకెళ్లి జనానికి పంపిణీ చేయాలని ఎమ్మెల్యే నితిన్‌ చెబుతున్నట్లు ఉన్న వీడియో కూడా బయటికొచ్చింది.