' లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ' విడుదలపై ఈసీ స్పందన

16:36 - March 15, 2019

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలైతే తెలుగు దేశం పార్టీకి నష్టం జరుగుతుందని  తెలుగు దేశం పార్టీ నాయకులు ఇటీవలే ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. అంతేకాదు  ఎన్నికల మొదటి దశ పూర్తి అయ్యేవరకు సినిమా విడుదలను అడ్డుకోవాలని ఈసీని టీడీపీ నాయకులు కోరిన విషయం కూడా తెల్సిందే. ఇదంతా అందరికీ తెలిసిన విషియమే...ఇప్పుడు ఆసక్తికర అంశం ఏంటీ అంటే...ఈ ఫిర్యాదులపై ఈసీ ఎలా స్పందిస్తూంది అన్నదే. ఆ వివరాల్లోకి వెలితే....సినిమా విడుదలను అడ్డుకోవడం కుదరదని అయితే సినిమా విడుదల తర్వాత అందులో ఎవరికైనా అనుకూలంగా సన్నివేశాలు ఉన్నాయా? ఓటర్లను ప్రభావితం చేసే విధంగా సన్నివేశాలు ఉన్నాయా ? ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా అందులో ఏమైనా కంటెంట్ ఉందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని అప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందని ముందే చర్యలు తీసుకోవడం కుదరదంటూ టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రజత్ కుమార్ సినిమా విడుదలను అడ్డుకోలేం అంటూ చేసిన వ్యాఖ్యలను వర్మ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. రజత్ కుమార్ మాటలతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అనుకున్నట్లుగా ముందు నుండి ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట.