' లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ 'పై మాట మార్చిన వర్మ...

15:34 - March 19, 2019

' లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ' సినిమా ఈనెల 22న విడుదలవుతుందని నిన్నటిదాకా రామ్‌గోపాల్‌ వర్మ చెప్పిన విషియం తెలిసిందే. కానీ ఇప్పుడు రామ్‌గోపాల్‌ వర్మ మాటమార్చేశారట. అదేంటంటే ' లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ' ఈనెల 22 కాదు 29న విడుదలవుతుందని. అసలు వివరాల్లోకి వెలితే...రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంకు సెన్సార్ సమస్యలు చుట్టు ముట్టాయి.  సెన్సార్ బోర్డు వారు ఎన్నికల ముందు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దాంతో సెన్సార్ బోర్డుపై కోర్టుకు కూడా వెళ్లబోతున్నట్లుగా వర్మ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సమయంలోనే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు కొత్త తేదీని ప్రకటించాడు. అదే ఈనెల 29వ తేదీ. 22వ తారీకు విడుదలకు సెన్సార్ సర్టిఫికెట్ రానప్పుడు 29వ తారీకు మాత్రం ఎలా విడుదల అవుతుందని అప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 29వ తారీకు వరకు వర్మ కోర్టుకు వెళ్లి అయినా సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకునే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎన్నికలకు ముందే విడుదల చేయాలని వర్మ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయో చూడాలి.