' లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ 'కి ప్లస్‌లు-మైనస్‌లు ఇవేనట!

17:00 - March 20, 2019

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాపై కోర్టుక్టియరెన్స్‌ ఇచ్చింది మరో వారంలో విడుదలవుతుందని వర్మ చెప్పడం జరిగింది. ఆ తరువాత మళ్లీ మాట మారుస్తూ ఈనెల 29కి వస్తుందని చెప్పారు. అసలు అది విడుదలయిందాకా కూడా ఏరోజు వస్తుందో తెలియని పరిస్థితి ఇప్పుడు వుంది. ఇదిలా ఉంచితే లక్ష్మీస్ ఎన్టీఆర్ కున్న ప్లస్సులు మైనస్సులు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ముందుగా పాజిటివ్స్ తీసుకుంటే  కొంత కాలంగా నీరసంగా బాక్స్ ఆఫీస్ కు ఎంతో కొంత ఉత్సాహం తెచ్చే సినిమాగా దీని మీద ఎన్నికల వేళ అంచనాలు బాగానే ఉన్నాయి. చంద్రబాబుని టార్గెట్ చేసినట్టు వర్మ పదే పదే చెబుతున్నాడు కాబట్టి మరోరకంగా ఆసక్తి కూడా నెలకొంది. అంచనాలు సగం అందుకున్నా చాలు సేఫ్ అయిపోతుంది. ట్రైలర్లు రెండూ మంచి స్పందన దక్కించుకోవడం విశేషం. ఇక నెగిటివ్‌ విషియాలకొస్తే...ఇందులో పాత్రల మీద క్రేజ్ ఉంది కానీ యాక్టర్స్ మీద ఒక్క శాతం కూడా లేదు. ఎన్టీఆర్ కీలక పాత్రధారి సహా ఎవరూ ప్రేక్షకులకు తెలిసినవాళ్ళు కాదు. చాలా మంది నటనకు మొదటిసారి అనిపించేలా ఉన్నారు. రేపు రెండు గంటల సేపు హాళ్లలో కూర్చోబెట్టాలి అంటే వీళ్ళ పాత్ర చాలా కీలకం. ఇవన్నీ ఒక ఎత్తయితే...అసలు వర్మ టేకింగ్‌ మీదనే గొప్ప నమ్మకాలూ లాంటివి ఏమి లేవు కానీ అగస్త్య మంజు అనే మరో దర్శకుడు తోడుండటంతో అతను కేర్ తీసుకుని ఉంటాడనే టాక్ అయితే ఉంది. సో ఈ రెండు బాలన్స్ చేసుకుని లక్ష్మిస్ ఎన్టీఆర్ కనక మంచి టాక్ తెచ్చుకుంటే మజిలీ వచ్చే దాకా వసూళ్లతో మేనేజ్ చేసుకుని ఈజీగా సేఫ్ అవ్వొచ్చు.కానీ పబ్లిసిటీ హంగామా తప్ప అసలు కంటెంట్ లో మ్యాటర్ ఉండదనే  విమర్శను ప్రతిసారి అందుకుంటూనే ఉన్న వర్మ ఈ సారి వాటిని బద్దలు కొడతాడా లేదా...చూడాలి.