23 జిల్లాలు, 2,500 మహిళలు: మధ్య నిషేధం కోసం మహా పాదయాత్ర

11:12 - January 29, 2019

 కర్ణాటకలోని 23 జిల్లాలకు చెందిన సుమారు 2,500 మహిళలు బెంగళూరు విధాన సభకు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ‘బీరు బేడ, నీరు బేకు’ అనే బ్యానర్‌పై మద్య నిషేధ ఆందోళన్ (ఎంఎన్ఏ) సంస్థ ఈనెల 19న చిత్రదుర్గలో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 9 గ్రామాల్లో పర్యటించి ఆల్కహాల్ వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రజలతో ముఖాముఖీ జరుపుతోంది.

మద్యపానం వల్ల జరిగే దుష్బరిణామాలపూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మద్యనిషేధం చేయలని మహిళలోకం ముందుకు సాగింది. సిద్ధ గంగ మఠం వద్ద ఆదివారం జరిగిన ప్రజాసదస్సు అనంతరం మాండ్య, మైసూరు, రామనగర, ఛామరాజ్ నగర్, తుంకూరుకు చెందిన మహిళలు ఈ పాదయాత్రలో వచ్చి చేరారు.'

రాష్ట్రంలోని సిద్ధ గంగ మఠం వద్ద ఆదివారం జరిగిన ప్రజాసదస్సు అనంతరం మాండ్య, మైసూరు, రామనగర, ఛామరాజ్ నగర్, తుంకూరుకు చెందిన మహిళలు ఈ పాదయాత్రలో వచ్చి చేరారు. మార్గమధ్యలోని క్యాడిగెరె, హోసూరు, నిత్యానంద ఆశ్రమ, జగగొండన హల్లి, తావర కెరె, సిర, చిక్కనహల్లి, సీబీ టెంపుల్, తుంకూరు, సిద్ధ గంగ మఠ్, ఆది శంకరాచార్య మఠ్, కులవనహల్లి, టి.బెగుర్, డాసనపుర, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, యశ్వంతపూర్ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.

2016లో ఏర్పాటైన ఎంఎన్ఏ మధ్యనిషేధంపై పోరాడుతోంది. వీరి డిమాండ్‌కు 30కి పైగా సంస్థలు మద్దతు తెలుపుతున్నారు. మద్యపానం వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. బుధవారం బెంగళూరుకు చేరుకుంటారు. రోజుకూ 20 కిలోమీటర్లు చొప్పున 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విధాన సౌధకు చేరుతారు. తమ పాదయాత్రలో మద్యం దుష్పరిణామాలు, మద్యనిషేధం అవసరంపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నట్టు ఉద్యమ నాయకులు అంటున్నారు. మార్గమధ్యలో బహిరంగ సభలు  నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు.