ఇతను ఆడా, మగా తేల్చి చెప్పండి: కుషాయి గూడా పోలిసుల పరేషాన్

06:08 - January 12, 2019

ఓ కేసు విచారణ విషయంలో పోలీసులని వింత డైలమాలో పడేసాడు ఓ నిందితుడు.  కార్ల చీటింగ్ కేసుకు సంబంధించి ఈ నెల 3న.. పోతులయ్య, సయ్యద్ సిరాజ్ హుస్సేన్‌లను హైదరాబాద్, కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో జెండర్ దగ్గర ఇద్దరినీ మగవాళ్లుగానే పేర్కొన్నారు. కానీ డైరీ నమోదు సమయంలో సయ్యద్ తాను ఆడపిల్లనని చెప్పి పోలీసులకు షాక్ ఇచ్చాడు.

దీంతో పోలీసులు ఏం చెయ్యాలో తెలియక డైలమాలో పడ్డారు.  ఈ కేసులో ఎలా ముందుకు పోవాలో అంతుచిక్కక పోలీసులు పరేషాన్ అవుతున్నారు. మాకు క్లారిటీ ఇవ్వండి  అంటూ ఫొరెన్సిక్ డాక్టర్లను పోలీసులు వేడుకుంటున్నారు. సంచలన మలుపులు తిరుగుతున్న కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసులో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాను మూడేళ్ల క్రితమే మగనుంచి ఆడపిల్ల గా మరిపోయాననీ, ఆడమనిషిగా మారటానికి లింగ మార్పిడి చేయించుకున్నానని. తన పేరు హుస్సేన్ కాదని. షాభిన అస్మి అని. తనది కరీంనగర్ జిల్లా ఫతేపూర్ అని చెప్పిన అథను తన పేరుని షాభినా పేరుతోనే నమోదు చేయాల్సిందిగా పోలీసులకు చెప్పడంతో వారు కంగుతిన్నారు. దీంతో అసలు ఆ వ్యక్తి ఆడా? మగా? నిర్ధారణ కోసం అతనిని పంపుతూ, గాంధీ ఆసుపత్రికి లేఖ రాశారు. షాభిన అస్మి అలియాస్ సయ్యద్ సిరాజ్ హుస్సేన్‌కు వైద్య పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసింది అడా లేక మగా తేలిన తర్వాతే ఈ కేసులో తదుపరి విచారణకు వెళ్లాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఆ వ్యక్తికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా గాంధీ ఆసుపత్రిలోని ఫొరెన్సిక్ విభాగానికి లేఖ రాశారు. షాభిన అస్మి అలియాస్ సిరాజ్ హుస్సేన్ కు వైద్య పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు. వైద్యుల నివేదిక ఆధారంగా సదరు నిందిత వ్యక్తి ఆడనా లేదా మగనా అన్నది తేల్చుకుని జెండర్ కాలమ్ నింపి కేసును ముందుకు కదిలించే పనిలో పడ్డారు కుషాయిగూడ పోలీసులు.  వైద్యుల నుంచి స్పష్టత వస్తే కానీ జెండర్ కాలమ్ నింపి.. చీటింగ్ కేసును పోలీసులు ఓ కొలిక్కి తీసుకురానున్నారు.