దర్శకుడు జే. మహేంద్రన్ కన్నుమూత: రజినీకాంత్ ని సూపర్ స్టార్ చేసిన దర్శకుడు

13:24 - April 2, 2019

*ప్రముఖ తమిళ దర్శకుడు జే.మహేంద్రన్ ఇకలేరు

*మ‌హేంద్ర‌న్ జానీ, ముల్లు ముల్లారం లాంటి సినిమాలతోనే రజినీకాంత్‌‌కు సూపర్‌స్టార్ హోదా

*మంగళవారం సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు

 

ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా ఇటు తెలుగు అటు త‌మిళంలో మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు జె. మ‌హేంద్ర‌న్ ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి త‌మిళ ప‌రిశ్ర‌మ సంతాపం ప్ర‌క‌టించింది. దర్శకుడు మహేంద్రన్ భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. ప్రజలు, అభిమానులు, సినీ దర్శకుల సందర్శనార్థం పార్దీవదేహాన్ని ఉంచుతారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తాం అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

                                                       

 సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌హేంద్ర‌న్ ఇంటికి వెళ్లి ఆయ‌న‌కి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో జె.మ‌హేంద్ర‌న్ తెరకెక్కించిన చిత్రాలు చాలా పెద్ద విజ‌యం సాధించాయి. మ‌హేంద్ర‌న్ తెరకెక్కించిన‌ జానీ, ముల్లు ముల్లారం లాంటి సినిమాలతోనే రజినీకాంత్‌‌కు సూపర్‌స్టార్ హోదా వచ్చింది. రజనీకాంత్‌ను సూపర్‌స్టార్‌గా మలవడంతో దర్శకుడు జే మహేంద్రన్‌ది గొప్ప పాత్ర.

రజనీ నటించిన ముల్లమ్ మలరమ్ చిత్రంతో దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 1980లో ఆయన రూపొందించిన నేంజథాయ్ కిలాథే చిత్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి. మ‌హేంద్ర‌న్ చివ‌రిగా రజినీ పేట, ఇళయ దళపతి విజయ్ థేరీ, విజ‌య్ సేతుప‌తి సీతాకాతి చిత్రాల‌లో నటించారు. 1979లో మహేంద్రన్ రూపొందించిన ఉత్తిరి పూకల్ అనే చిత్రం ఎంతో మంది దర్శకులకు స్ఫూర్తి నింపింది.

                                                       

మణిరత్నం, శంకర్ లాంటి దిగ్గజ దర్శకులను డైరెక్టర్లుగా మార్చేందుకు ఇన్సిపిరేషన్‌గా నిలిచింది. దర్శకుడిగా ఆయన మొత్తం 12 చిత్రాలు రూపొందించారు. అరవింద్ స్వామి, గౌతమి జంటగా రూపొందించిన శాసనం మూవీ ఆయనకు చివరిది. ఆ తర్వాత పదేళ్ల అనంతరం ఆయన నటుడిగా మారారు. ర‌చ‌యిత‌గా కెరీర్ ప్రారంభించిన ఆయ‌న అత్య‌ద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఈ రోజు సాయంత్రం జ‌ర‌గ‌నున్నాయి.