కేజీఎఫ్ టైములొ కరెంట్ తీస్తే పేల్చేస్తాం: యశ్ అభిమానుల హెచ్చరిక, లేఖరాసి మరీ...

13:13 - March 30, 2019

*పవర్ కట్ చేస్తే  ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ తగలబెడతాం

*కేజీఎఫ్ హీరో యశ్ అభిమానుల వార్నింగ్ 

*ఈ 30 మార్చి కలర్స్ టీవీలో KGF  ప్రీమియర్

 

కేజీఎఫ్ ఈమధ్య కాలం లో సౌథ్ ఇండియన్ సినిమాలో ఇంత ప్రకంపణలు రేపిన సినిమా ఇంకోటిలేదేమో. అప్పుడప్పుడే ఎదుగుతున్న ఒక చిన్న హీరోని ఓవర్నైట్ ఇండియా లెవెల్లో స్టార్ ని చేసిన సినిమా. అసలు మామూలుగా ఆడితే చాలనుకుంటే 200 కోట్లు కొల్లగొట్టుకుపోయిన సినిమా. ఇప్పుడు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీల్లో ఈ సినిమా, ఆ  హీరో రెండూ  హాట్ టాపిక్సే. 
  

కేజీఎఫ్, యశ్  రేంజ్ ఎక్కడిదాకా వెళ్ళిందంటే ఆ సినిమా టీవీలో వచ్చేరోజు గనక పవర్ కట్ అయియే ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డ్ ఆఫీసునే తగలబెడతామని వార్నింగ్ ఇచ్చేంత. వినటానికి కాస్త ఓవర్ అనిపించినా ఇది నిజంగానే జరిగింది.  కర్నాటక భద్రావతి తాలూకా శివమొగ్గ జిల్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కి యశ్ వీరాభిమాని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. 

యశ్ నటించిన కేజీఎఫ్ ప్రీమియర్ ఈ శనివారం (30 మార్చి)  సాయంత్రం 7 గంటలకి కలర్స్ టీవీలో  ప్రీమియర్ వేస్తున్నారు. అయితే ఆ సమయంలో పవర్ కట్ చేస్తే మంగుళూర్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ (MESCOM)ని తగలబెట్టేస్తామని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం కలకలకం రేపింది. ఆ మేరకు ఓ లేఖను ఎలక్ట్రిసిటీ బోర్డ్ కే అందేలా చేసారు సదరు అభిమానులు. అయితే యశ్ అభిమానులుఇంత కోపంగా, మూర్ఖంగా అనిపించేలా ప్రవర్థించటానికి ఓ బలమైన కారణమే ఉంది. 

ప్రస్తుతం కన్నడ నాట పొలిటికల్ హీట్ ఓ రేంజులో రాజుకుంది. రాజకీయాల్లో పోటీ చేస్తున్న సుమలత కోసం దర్శన్ యశ్ లాంటి హీరోలు ప్రచారానికి విచ్చేస్తే ఆ సమయంలో ప్రచార సభకు అంతరాయం కలిగేలా పవర్ కట్ చేశారు. అంతే కాదు అక్కడ నుంచి మీడియా చానెళ్ళ ద్వారాకూడా జనానికి విషయం చేరకుండా ఉండేందుకు కేబుల్ టీవీ ప్రసారాలనీ నిలిపివేసారు, కొన్ని ఏరియాలలోనూ అనధికార పవర్ కట్ కొనసాగింది. ఎలక్షన్ క్యాంపెయినింగ్ వేళ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి మాంద్యలో కరెం

ట్ కోత విధిస్తున్నారని యశ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. అందుకే సుమలతకు మద్దతు తెలుపుతున్న యశ్ సినిమా టీవీలో వస్తూంటే కూడా ఇలాంటి ప్రయత్నాలే జరగవచ్చని భావించిన అభిమానులు ముందే ఇలా వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఇదిలా ఉంటే మరోపక్క కేజీఎఫ్ సీక్వెల్ ని ఈ ఏప్రిల్ లోనే సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని పట్టుదలగా పనిచేస్తోంది సినిమా యూనిట్.