అన్ని ఆంక్షలనూ బ్రేక్‌ చేస్తూ..అనుకున్నది సాధించిన కేరళ ప్రభుత్వం

11:56 - January 3, 2019

అందరికీ అన్నీ సమానంగా వుండాలని కోరుకునేది ఒకే ఒక్కరు వారే కమ్యునిస్టులు. పురుషులకు, స్త్రీలకు అన్నిటిలోనూ సమాన హక్కులు వుండాలని, అందరికీ విద్య అవసరమని, అంతటా సామాజిక న్యాయం రావాలని పోరాడేది కూడా కమ్యునిస్టులే. అయితే ఇదే నేపథ్యంలో ఎప్పటినుండో శబరిమల ఆలయంలోకి 50 సంవత్సరాల లోపు మహిళలు ప్రవేశించకూడదనే ఆంక్షలు వున్నాయి. ఇవి ఇప్పటి నుంచి కాదు బ్రిటీష్‌ కాలం నుండి వున్నాయి. ఈ ఆంక్షలన్నింటినీ బ్రేక్‌ చేస్తూ...కేరళ ప్రభుత్వం 50 సంవత్సరాల లోపు ఇద్దరు మహిళలను పోలీసుల సంరక్షణలో శబరిమల ఆలయంలోకి పంపించింది. వివరాల్లోకి వెలితే...50 ఏళ్ల లోపు ఉన్న మహిళలు శబరిమల ఆలయ ప్రవేశంపై ఉన్న అభ్యంతరాన్ని సుప్రీం తప్పు పట్టి తీర్పు ఇచ్చిన మూడు నెలల తర్వాత పట్టుబట్టి మరి.. ఇద్దరు మహిళల్ని ఆలయ ప్రవేశం చేయించిన వైనం తెలిసిందే. 50 ఏళ్ల లోపు మహిళల్ని శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు దాదాపుగా 200 ఏళ్లకు పైనే ఉన్నట్లు చెబుతారు.ఈ విషయంలో కచ్ఛితమైన ఆధారాలు లేకున్నా.. 19వ శతాబ్దంలో బ్రిటిష్ సర్వే నివేదిక ప్రకారం 200 ఏళ్ల క్రితం నుంచే శబరిమల ఆలయ ప్రవేశంపై ఆంక్షలు ఉన్నట్లుగా చెబుతారు. వీటిని బ్రేక్ చేస్తూ.. కోర్టు తీర్పు ఇచ్చినా.. అనధికార ఆంక్షలు కొంతకాలంగా సాగుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం.. దాన్ని అమలు చేసేందుకు కేరల కమ్యునిస్టు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఎట్టకేలకు 50 ఏళ్ల లోపు మహిళలను ఆలయ ప్రవేశం చేయించి అనుకున్నది సాధించింది.