సహాయం అందించాల్సింది పోయి...ఆ రాష్ట్రంపై ఆర్థిక భారం మోపుతున్న కేంద్రం...

12:22 - February 5, 2019

ఆ రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకంత కోపం?...సహాయం అందించాల్సింది పోయి ఇంకా...ఆర్థిక భారం మోపుతోంది ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో లేదో తెలియదు. అసలు ఏ రాష్ట్రం పైన కేంద్రం అంతగా వివక్ష చూపుతుందా...? అనుకుంటున్నారా..? ఇంకేముంటుందండీ..కేరళ పైనే. వివరాల్లోకి వెలితే...కొన్ని నెలల క్రితం కేరళను వరద బీభత్సంతో ఏవిధంగా అతలాకుతలం చేశాయో అందరికీ తెలిసిన విషియమే. ఆ సమయంలో చిన్నా, పెద్ద అంతా కూడా కేరళకు సహాయ నిధులు పంపడం జరిగింది.  ఇదిలా వుంటే...వరదలు సంభవించిన సమయంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్లర్లను వినియోగించుకున్నందుకు గానూ 102 కోట్ల రూపాయల బిల్లును కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పంపినట్లుగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్‌ భామ్రీ వెల్లడించారు. వరద సహాయపనులు చేపట్టినందుకు కూడా బిల్లులు పంపించడంపై కేరళలో కేంద్రంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

                 కేరళలో వరదలు సంభవించిన సమయంలో సహాయ పనుల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను వినియోగించారని, ఈ హెలికాప్టర్ల ద్వార 3787మందిని కాపాడామని, 350 టన్నుల ఆహార పదార్థాలను వరద ప్రాంతాలకు చేరవేశామని మంత్రి పేర్కొన్నారు. వరదల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సేవలకు గాను బిల్లు చెల్లించాలని కోరినట్లు మంత్రి చెప్పారు. వరద సహాయ పనుల బిల్లులు చెల్లించాలని తాము కోరామని మంత్రి వివరించారు. అంత విపత్తు జరిగిన రాష్ట్రంపై మళ్లీ సహాయ పనులకు కూడా ఇంతగా బిల్లు వెసిన కేంద్రం ప్రవర్తనపై పలవురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.