పెళ్లికి ఆ ఇద్దరిలా వుండే కుర్రాడు కావాలి: కీర్తి సురేష్‌

14:43 - December 30, 2018

తమిళం తెలుగు సినీ పరిశ్రమలో నటిస్తూ కీర్తి సురేష్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగులో కాస్త స్లోగా ఈమె జర్నీ సాగుతున్నా కూడా తమిళంలో మాత్రం ఈమె జోరు మామూలుగా లేదు. ఇప్పటికే అక్కడ దాదాపుగా స్టార్ హీరోలందరితో నటించేసింది.  త్వరలోనే రజినీకాంత్ తో ఈమె కనిపించబోతుంది. మురుగదాస్ దర్శకత్వంలో ఇప్పటికే ఈమె సర్కార్ చిత్రంలో విజయ్ కి జోడీగా నటించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కీర్తి సురేష్ ను మరోసారి తన సినిమాకు మురుగదాస్ ఎంపిక చేసుకున్నాడు. అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న రజినీకాంత్ మూవీతో పాటు ఇంకా రెండు మూడు సినిమాలకు కూడా ఈమె కమిట్ అయ్యింది. ఒక మలయాళి చిత్రంలో కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా బిజీగా గడుపుతున్న కీర్తి సురేష్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలపై స్పందించింది. కీర్తి సురేష్ ను ఆ ఇంటర్వ్యూలో పెళ్లి గురించిన ప్రశ్నించిన సమయంలో ఇప్పుడు తనకు పెళ్లి ఆలోచన లేదని చెప్పింది. పెళ్లి చేసుకునే సమయం తనకు ఇంకా రాలేదని చెప్పింది. అయితే ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని ప్రశ్నించిన సమయంలో మాత్రం తమిళ స్టార్ హీరోలు విజయ్ విక్రమ్ ల మాదిరిగా ఉండే కుర్రాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పింది. ఈ ఇద్దరి స్టైల్ స్మైల్ బాడీ లాంగ్వేజ్ తనకు బాగా నచ్చుతాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు..ప్రేమ పెళ్లా లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే విషయంలో తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చింది.