మరో ఛాలెంజింగ్‌ పాత్రలో కీర్తి సురేష్‌

17:25 - March 19, 2019

గ్లామర్ రోల్స్ కి దూరంగా విభిన్న ప్రయత్నంగా సావిత్రి గారి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ దాని వల్ల ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందో ప్రత్యక్షంగా చూశాం. అయితే అలాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ మరోసారి చేసే అవకాశం కీర్తికి దక్కింది.  అజయ్ దేవగన్ హీరోగా నిన్నటి తరం ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ జీవిత కథ ఆధారంగా రూపొందబోయే సినిమాలో కీర్తి సురేష్ హీరొయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. గత ఏడాది సర్ ప్రైజ్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన బదాయిహో దర్శకుడు అమిత్ శర్మ దీనికి కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. బోనీ కపూర్ నిర్మాతగా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారం  అయితే కీర్తి సురేష్ పాత్రకు సంబంధించి ఇందులో ఓ విశేషం ఉందట. అదేంటంటే మొత్తం రెండు వయసుల పాత్రలలో కీర్తి కనిపిస్తుంది. ఒకటి ఇబ్రహీం వయసులో ఉన్నప్పుడు తనను ప్రేమించే అమ్మాయిగా తర్వాత నలభై పడికి దగ్గర పడిన మిడిల్ ఏజ్ మహిళగా మరో యాంగిల్ లో తన పాత్రను డిజైన్ చేశారట. ఛాలెంజింగ్ గా ఉండటంతో పాటు ఇలాంటి డెబ్యు అయితేనే బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని గుర్తించిన కీర్తి సురేష్ ఎక్కువ ఆలస్యం చేయకుండా ఒప్పేసుకుంది. పెర్ఫార్మన్స్ పరంగా మహానటి స్థాయిలో ఇందులో నటించాల్సి ఉంటుందని అమిత్ శర్మ ముందే చెప్పాడట. మొత్తానికి కొంత లేట్ అయినా తన టాలెంట్ కి పదును పెట్టె మరో కథలో రాబోతోంది కీర్తి.