మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేసిన కత్తి: ఈసారి ఎవరిమీదో తెలుసా...?

13:48 - January 28, 2019

కత్తి మహేష్‌ మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేశాడు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. గడువు పూర్తయి మళ్లీ నగరంలోకి అడుగుపెట్టిన కత్తి మళ్లీ విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈసారి కత్తి డోస్‌ పెంచాడట!.పవన్ తో పాటు చంద్రబాబుని కూడా టార్గెట్ చేశాడు. నాకు గుండు కొట్టింది పరిటాల రవి కాదు అని పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లుగా - నా తండ్రిని చంపింది టీడీపీ నేతలు కాదు అని వంగవీటి రాధా అన్నట్లుగా - అలాగే చంద్రబాబు మా నాన్నను వెన్నుపోటు పొడవలేదు అని బాలకష్ణ అన్నట్లుగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు కత్తి. ఫైనల్ గా.. సరెండర్ అయినవాళ్లు ఇలాంటి భాషే వాడతారంటూ  కౌంటర్ వేశాడు. అంటే.. పవన్ - వంగవీటి రాధా - బాలయ్య అంతా రకరకాల కారణాల వల్ల.. అమ్ముడుపోయారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు కత్తి మహేశ్.ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే దీనికి కారణం లేకపోలేదట!. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు కత్తి మహేశ్. ఆ ఉద్దేశంతోనే పార్టీల మీద వ్యాఖ్యలు చేస్తున్నాడు. తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉందని చెప్పిన కత్తి.. వైసీపీలో చేరతాడని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అందుకే అందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్.. వైసీపీ - బీజేపీపై ఒక్క కామెంట్ కూడా చేయలేదని విమర్శలు విన్పిస్తున్నాయి.