జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎందుకు సైలెంట్‌ అయ్యాడు?

13:05 - January 10, 2019

ఏళ్ల నుంచి ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. తెలుగోళ్ల ఆరాధ్య దైవం.. ప్రత్యర్థులు సైతం పొగిడే తత్త్వం ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది. నందమూరి ఫ్యామిలీతో పాటు, ఫ్యాన్స్‌ అంతా కూడా ఈ సినిమా చూసి దాని గురించే మాట్టాడటం మొదలుపెట్టారు. సినిమాలోని పాత్రల గురించి, సన్నివేశాల గురించి సూపర్‌, అద్భుతం, అదిరిపోయింది అంటూ అంతా సందడి చేస్తున్నారు. అయితే ఇంత మంది ఇంతలా ఉత్సాహపడుతున్నప్పటికీ...ఎన్టీఆర్‌ పోలికలను అచ్చుగుద్దినట్టుగా పొందిపుచ్చుకోని పుట్టిన జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం అసలు దీనిపై రియాక్ట్‌ అవ్వలేదు. ఏళ్ల నుంచి ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. తెలుగోళ్ల ఆరాధ్య దైవం.. ప్రత్యర్థులు సైతం పొగిడే తత్త్వం ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది. తన సినిమాల్లో ఒక్కసారైనా ఆ తాతకు మనమడ్ని అంటూ చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్..ఈ సినిమాపై అసలు స్పందించలేదు ఎందుకు అన్నదే ఇప్పుడు అందరి మనసులో ఉన్న సందేహం. ఆ మాటకు వస్తే సినిమా చూసినట్లుగా కూడా లేదంటున్నారు. బాబాయ్ బాలయ్యతో రిలేషన్ పెద్దగా లేదన్న మాటలు వినిపిస్తున్న వేళ.. కథానాయకుడు సినిమా మీద తారక్ ఇంత వరకూ రియాక్ట్ కాకపోవటం ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాకు తనకూ ఏ మాత్రంసంబంధం లేదన్నట్లుగా ఆయన తీరు ఉందంటున్నారు. బాబాయ్ తో పంచాయితీ ఉంటే ఉండొచ్చు. దాన్ని పక్కన పెడితే.. తన సోదరుడు కల్యాణ్ రామ్ తన తండ్రి పాత్రను పోషించిన నేపథ్యంలో.. ఈ మూవీ గురించి తారక్ మాట్లాడతారని భావించినోళ్లకు నిరాశే మిగిలింది. తారక్ ట్విట్టర్ పేజీలో ఈ మూవీకి సంబంధించిన చాలా పాత అప్డేట్ ఉంచారు. సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో తాత మీద ఉన్న అభిమానాన్ని.. తన వాల్ పేజీ పిక్ ను మారుస్తారని భావించిన వారికి షాకిస్తూ.. అలాంటిదేమీ చేయకుండా.. ఆ మధ్యన రిలీజ్ అయిన అరవింద సమేత మూవీ పోస్టర్ ను ఉంచేయటం గమనార్హం. ఇదంతా చూస్తే.. కథానాయకుడి మూవీతో తనకేం సంబంధం లేదన్నట్లుగా తారక్ తీరు ఉందన్నట్లుగా ఉంది అని పలువురు భావిస్తున్నారు.