200 కోట్లక్లబ్ లో కేజీఎఫ్: ఈ రికార్డులో తొలి కన్నడ మూవీ ఇదే

05:35 - January 12, 2019

క‌న్నడ చిత్రపరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా గుర్తింపు పొందిన చిత్రం ‘కేజీఎఫ్‌’. గత డిసెంబరు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం. భారీ వ‌సూళ్ల‌ను రాబట్టింది.క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ చిత్రం డిసెంబర్ 21న రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇటీవల కాలంలో బాహుబలి తర్వాత ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించిన చిత్రంగా కేజీఎఫ్ సొంతం చేసుకొన్నది.


           కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించగా, దీన్ని 2400 థియేటర్లలో విడుదల చేశారు. విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రానికి మంచి టాక్‌ వచ్చింది. ఒక్క హిందీలోనే ఈ చిత్రం ఏకంగా రూ.40 కోట్ల మేరకు వసూలు సాధించింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్లు రాబట్టిన తొలి కన్నడ మూవీగా యష్‌, శ్రీనిధి శెట్టిల కేజీఎఫ్‌ రికార్డు నెలకొల్పింది. 


     విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్‌ మెరుగైన వసూళ్లు సాధించింది. షారుక్‌ ఖాన్‌ జీరో, రణ్‌వీర్‌ సింగ్‌ల సింబా సినిమాలను తట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్‌ రూ 40 కోట్లు వసూలు చేయడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. కేజీఎఫ్‌ సంచలన విజయం కన్నడ చిత్ర పరిశ్రమ భారీ కలలకు రెక్కలు తొడిగిందని, భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమా భారీ వసూళ్లు రాబట్టిందని బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. కేజీఎఫ్‌ అనూహ్య విజయం హీరో యష్‌కు ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. 

సీక్వెల్ కూడా వస్తోంది 

నిర్మాత విజ‌య్ కిరంగ‌న్ దుర్ కేజీఆఫ్ చిత్రానికి సంబంధించి సీక్వెల్ చేయాల‌ని భావించ‌గా, ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా మొద‌లు పెట్టేశారు. ప్ర‌స్తుతం చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించిన నటీన‌టుల కోసం ప‌లువురి పేర్ల‌ని ప‌రిశీలిస్తున్నారు. అయితే ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌ని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. ఇక మొదటిభాగంలో చేసిన రవిశంకర్ .. అదే పాత్రలో రెండవ భాగంలోను కొనసాగుతాడట. కాకపోతే అత‌ని పాత్ర‌ని మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా రూపొందించ‌నున్నార‌ట‌. దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. చూడాలి మ‌రి సీక్వెల్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో.