100 కోట్లు వసూలు చేసిన కాంచన-3

15:22 - April 26, 2019

ముని సిరీస్ లో వచ్చిన 'కాంచన 3' చిత్రం బి - సి సెంటర్లలో కుమ్మేస్తోంది. తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి వారం పూర్తి అయ్యేప్పటికి ఏకంగా 100 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. లారెన్స్ మూవీ 100 కోట్ల వసూళ్లను రాబట్టడం ఇదే ప్రథమం. గతంలో కాంచన మంచి విజయాన్ని సాధించినా కూడా ఈమార్క్ ను దక్కించుకోలేక పోయింది. తెలుగు రాష్ట్రాల్లో జెర్సీ - మజిలీ - చిత్రలహరి వంటి డైరెక్ట్ చిత్రాలు ఉన్నా కూడా మాస్ ఆడియన్స్ మాత్రం కాంచన 3 చిత్రానికే పట్టం కట్టడం ఆశ్చర్యంగా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో పాటు - హర్రర్ సినిమా అవ్వడం - కాంచన అనే టైటిల్ పెట్టడం వల్ల ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. దాంతో ఈ కలెక్షన్స్ సాధ్యం అయ్యాయి. కాంచన 3 చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో కాంచన 4ను కూడా త్వరలోనే లారెన్స్ మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.